/rtv/media/media_files/2025/03/11/qdJYzBfQ0k3CKrto5EOU.jpg)
Old Mobile Phone
Old Mobile Phone : పాత మొబైల్స్‌కు ప్లాస్టిక్ వస్తువులు ఇస్తాం..అని ఎవరైన మీ ప్రాంతంలో తిరుగుతున్నారా? ప్లాస్టిక్ వస్తవులకు ఆశపడి పనికిరాని పాత మొబైల్ ఫోన్లను అమ్ముతున్నారా? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే. అంతేకాదు సైబర్ నేరగాళ్లకు మీరు తాళం చెవి చేతికిచ్చినట్లే. పాత ఇనుప సామాన్లు, స్టీల్ సామాన్ల ముసుగులో పాత ఫోన్లను కొనుగోళ్లు చేస్తూ.. ఆ ఫోన్లను బీహారీకి అమ్మేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ఠ్ చేశారు ఆదిలాబాద్ పోలీసులు. ఆరుగురు నిందితులతో కూడిన బిహార్ ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాకు తెలిపారు.
Also Read: రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో ట్విస్ట్.. కర్ణాటక సర్కార్ కీలక ఆదేశం
బీహార్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు నిందితులు ముఠాగా ఏర్పడి దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడడానికి పథకం వేసుకున్నారు. దీనిలో భాగంగానే తబరాక్ అనే వ్యక్తి గ్యాంగ్ లీడర్‌గా కొనసాగుతూ మిగిలిన ఐదుగురు వ్యక్తులను దేశవ్యాప్తంగా బైకులపై పంపుతూ పాత సెల్ ఫోన్లు కొనుగోళ్లు చేయిస్తున్నాడు.. ఆ ఐదుగురు ఊరూర తిరుగుతూ పాత మొబైల్ ఫోన్లు కొంటారు. పాడైన ఫోన్లు కొంటామంటూ.. స్టీల్ సామాన్లకు ప్లాస్టిక్ డబ్బాలకు పాత ఫోన్లు తీసుకుంటామంటూ పాత మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, బ్యాటరీలను సేకరిస్తున్నారు.. ఈ సెల్ ఫోన్లు, సిమ్ కార్డుల ద్వారా తబరాక్, అతని అనుచరులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు బ్యాంకు అధికారులమని, ఉద్యోగాలు ఇప్పిస్తామని, లాటరీ గెలిచారని ఫోన్ చేస్తూ వివిధ రకాలుగా నమ్మిస్తూ మోసం చేస్తున్నారని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
Also Read : లక్నోకు బిగ్ షాక్.. ఫస్టాఫ్‌కు మయాంక్ దూరం!
ప్రజలకు ఓటీపీ పంపించి వాటి ద్వారా అమాయకుల బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులను మళ్లించుకుంటున్నారని.. ఇప్పుడు స్వాధీనం చేసుకున్న ఫోన్ల ద్వారా వేల మంది అమాయక ప్రజలను మోసగించాలని కుట్ర పన్నినట్లు ఎస్పీ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా సంచరిస్తూ కొనుగోలు చేసిన 2125 ఫోన్లతో భారీ కుట్రకు ఫ్లాన్ వేశారని.. ఇప్పటికీ ఆ మొబైల్ ఫోన్, సిమ్ కార్డులు అమాయక ప్రజల పేరుపై ఉండడంతో మోసాలు చేసినవారు దొరకకుండా యదేచ్చగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని.. పాత ఫోన్లే కదా అని గుర్తు తెలియని వ్యక్తులకు స్టీల్ పాత్రలకు ఆశపడి అమ్మితే చిక్కుల్లో పడటం తప్పదని ఎస్పీ మహాజన్ హెచ్చరించారు.
Also read : డంకీరూట్ లో మరో ఇండియన్ మృతి..అక్కడే భార్య బిడ్డలు!
Also read : CSK: జడేజా ఎంట్రీ వీడియో మామూలుగా లేదుగా...పుష్పరాజ్ రేంజ్ లో ..!
నిందితులను తబ్రక్ , మహ్మద్ మెర్జుల్, మహబూబ్, మహ్మదగ జమాల్, ఎండి ఉజిర్, అబ్దుల్లాగా గుర్తించారు. వీరి వద్ద నుంచి దాదాపు 2,125 పాత మొబైల్ ఫోన్లు, 107 సిమ్ కార్డులు, ఐదు ద్విచక్ర వాహనాలు, ఐదు మొబైల్ ఫోన్లు, 600 మొబైల్ బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ ముఠా కర్ణాటక రాష్ట్రంలో దాదాపు పది నుంచి 12 వేల వరకు మొబైల్ ఫోన్లను సేకరించి వాటి ద్వారా సైబర్ నేరాలకు పాల్పడినట్లు ఎస్పీ మహాజన్ తెలిపారు. బైకులపై తిరుగుతూ మీ ఊర్లలో మీ వాడలో పాత ఫోన్లు కొనుగోలు చేస్తామని ఎవరైనా వస్తే వారి సమాచారం పోలీసులకు ఇవ్వాలని ఎస్పీ అఖిల్ మహాజన్ విజ్ఞప్తి చేశారు. పనికి రాని ఫోన్లే కదా అని అమ్మేసి సైబర్ నేరాలకు బలికావద్దని హెచ్చరించారు.
Also Read: చైనా సైంటిస్టుల అద్భుతం.. గుండెపోటు, స్ట్రోక్స్ రాకుండా వ్యాక్సిన్!