/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ap-govt-jpg.webp)
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ షురూ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే.. ఒక రాష్ట్రంలో ఒకే గ్రామీణ బ్యాంకు ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. గ్రామీణ బ్యాంకుల్నే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటారు. ఒకే రాష్ట్రం.. ఒకే గ్రామీణ బ్యాంక్ నినాదంతో ఈ విధానాన్ని తీసుకొచ్చింది.
Also Read: Paritala Ravi: 18ఏళ్ళ తర్వాత..పరిటాల రవి హత్య కేసులో నిందితులకు బెయిల్
AP Grameena Vikas Bank
ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నిర్వహణలో సమర్థత పెంచుతూ.. ఖర్చుల్ని తగ్గించేందుకే కేంద్ర ప్రభుత్వం.. ఈ బ్యాంకుల విలీన ప్రక్రియను మరింత వేగవంతం చేస్తోంది. ఇదివరకే 3 దశలుగా ఈ విలీన ప్రక్రియ జరగ్గా.. ఇప్పుడు నాలుగో విడత విలీన పనులు మొదలుపెట్టింది. 2025, జనవరి 1 నుంచే ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తుంది.
Also Read: Ap Crime: ఏపీలో దారుణం.. సినీ ఫక్కీలో డెడ్ బాడీ పార్శిల్!
ఏపీ, తెలంగాణలో కూడా మొత్తం 5 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. ఇప్పుడు ఇవి కూడా విలీనం కాబోతున్నాయి. పెద్ద బ్యాంకులో విలీనం అవుతాయని చెప్పొచ్చు. తాజాగా ఈ విలీనానికి సంబంధించి.. ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు ఓ కీలక ప్రకటన చేసింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ సహా.. తన ట్విట్టర్ హ్యాండిల్లోనూ ఇంపార్టెంట్ పబ్లిక్ నోటీసు పేరుతో ఓ ప్రకటన విడుదల చేసింది.
Also Read: KTR: కేటీఆర్ కు మరో బిగ్ షాక్.. రంగంలోకి స్పెషల్ టీమ్!
ప్రస్తుతం ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు .. రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవలు అందిస్తుండగా.. ఇక కేవలం ఏపీకే పరిమితం కాబోతుంది. తెలంగాణలోని ఏపీజీవీబీ శాఖలు అన్నీ.. అక్కడి గ్రామీణ బ్యాంక్ అయిన తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనమైన కార్యకలాపాల్ని కొనసాగిస్తుంది. ఇక ఏపీజీవీబీ సేవలు ఏపీలో మాత్రమే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఏపీలో ఇదే పేరుతో కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు తెలిపింది. జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది.
Also Read: Jaipur: పెట్రోల్ బంక్ లో భారీ అగ్ని ప్రమాదం..ఐదుగురి మృతి!
ఈ విలీన ప్రక్రియలో భాగంగా.. తెలంగాణలోని మొత్తం 493 ఏపీజీవీబీ బ్రాంచులు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కలవనున్నాయి. ఏపీలోని 278 బ్రాంచులు.. అదే పేరుతో ఏపీలో కొనసాగనున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సహా ఏపీలోని తమ కస్టమర్లకు నోటీసు ద్వారా తెలియజేసింది. ఈ రెండు బ్యాంకుల మధ్య ఇప్పుడు ఆస్తులు, అప్పులు విభజనకు కట్టుబడి ఉన్నట్లు సమాచారం. బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా.. తెలంగాణలోని తమ బ్రాంచులు అదే ప్రదేశంలో ఉంటాయని.. ఏదైనా సమాచారం కోసం బ్యాంకును సంప్రదించాలని అధికారులు తెలిపారు.