/rtv/media/media_files/2026/05/12/bandi-bhagirath-2026-05-12-13-40-41.jpg)
బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో రోజుకొక బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న భగీరథ్ పై SIT అధికారులు మరో కీలకమైన సెక్షన్‌ను అదనంగా చేర్చారు. కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేలా కీలక ఆధారాలను మాయం చేశాడనే బలమైన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పోలీసులు లీక్ చేసిన వివరాల ప్రకారం.. బండి భగీరథ్ పక్కా ప్లాన్‌తోనే పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన తర్వాత ఆయన తన మొబైల్ ఫోన్‌ను పోలీసులకు అప్పగించారు. అయితే, ఆ ఫోన్‌లో సిమ్‌కార్డు లేకపోవడాన్ని పోలీసులు గుర్తించారు.
సిమ్ కార్డ్ ఎక్కడ ఉంది? అని సిట్ అధికారులు ప్రశ్నించగా.. "ఎక్కడో పెట్టి మర్చిపోయాను" అంటూ భగీరథ్ సమాధానం చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా, ఫోన్‌లోని కాల్ డేటా, వాట్సప్ చాట్స్, సోషల్ మీడియా అకౌంట్లకు సంబంధించిన కీలక డేటాను పూర్తిగా డిలీట్ చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. కేసు తీవ్రతను తగ్గించుకునేందుకు, టెక్నికల్ ఆధారాలు దొరక్కుండా చేసేందుకే ఇలా చేశారనేది పోలీసుల వాదన.
ఆధారాలు ధ్వంసం చేయడం, పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడంతో సిట్ అధికారులు భగీరథ్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 238 ను అదనంగా జత చేశారు. నేరానికి సంబంధించిన సాక్ష్యాలను స్క్రీన్ చేయడం లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం ఈ సెక్షన్ కిందికి వస్తుంది.
BIG BREAKING
— Political Pulse (@PoliticalP48440) May 20, 2026
బండి భగీరథ్ పోక్సో కేసులో మరో బిగ్ ట్విస్ట్
పరారీలో ఉన్నప్పుడు.. తనపై నమోదైన పోక్సో కేసులో ఆధారాలను మాయం చేసిన బండి భగీరథ్
ఆధారాల్ని మాయం చేశాకే.. పథకం ప్రకారం పోలీసుల ముందు లొంగిపోయాడని ఓ అధికారి వెల్లడి
విచారణ సమయంలో తమకు అతను ఖాళీ ఫోన్ ఇచ్చాడని.. అందులో సిమ్… pic.twitter.com/A0VzcFcUYM
సెక్షన్లు మార్చడం ఇది మూడోసారి
కాగా ఈ కేసు ప్రారంభమైనప్పటి నుండి భగీరథ్‌పై పోలీసులు సెక్షన్లు మార్చడం ఇది మూడోసారి. ఇప్పటికే పోక్సో సహా పలు కఠిన సెక్షన్లు ఉండగా.. ఇప్పుడు కొత్తగా BNS 238 చేర్చడంతో భగీరథ్‌కు న్యాయపరమైన ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఫోన్ డేటాను రికవరీ చేసేందుకు పోలీసులు ఈ మొబైల్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్ (FSL) ల్యాబ్‌కు పంపే యోచనలో ఉన్నారు.
Follow Us