Online Betting : ఖమ్మం జిల్లాలో విషాదం..ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలి

బెట్టింగ్ ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతోంది. ఈ వ్యసనం మొత్తం కుటుంబం పాలిట శాపంగా మారుతుంది. తాజాగా..ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లతో అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో మృతుడి కుటుంబం విషాదంలో మునిగింది.

New Update
 Online Betting

 Online Betting

 Online Betting : బెట్టింగ్ ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతోంది. ఒక్కరి వ్యసనం..మొత్తం కుటుంబం పాలిట శాపంగా మారుతుంది..తాజాగా..ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లతో అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో మృతుడి కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి... జాగ్రత్త!

ఖమ్మం నగరంలోని వైఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన ఎండీ మొహినుద్దీన్‌ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు, కుమార్తె..మొహినుద్దీన్‌ కారు డ్రైవర్‌గా పనిచేసేవారు. సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివిన కుమారుడు ఎం.డి.అజీజుద్దీన్‌(27) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అజీజుద్దీన్‌ చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడు. తన ఆర్థిక స్తోమతకు మించి తండ్రి బాగా చదివించారు. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో ఆ యువకుడు ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు.. బెటింగ్ లలో పెట్టుబడి పెట్టేందుకు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చాడు. అయినా వాటిలో డబ్బులు రాకపోగా.. ఉన్న డబ్బులు మొత్తం పోయాయి. అప్పులు ఎక్కువయ్యాయి. అయితే..అప్పులు తీర్చాలని ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో అర్ధరాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..    

Also Read: Mamata Benarjee: అది నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తా.. బీజేపీకి దీదీ సవాల్

ఉద్యోగం చేస్తూనే అజీజుద్దీన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ బెట్టింగులకు అలవాటుపడ్డాడు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ పెట్టాడు. జీతం డబ్బులతో తీర్చినా ఇంకా మిగిలాయి. గతంలో అప్పులవాళ్లు ఇబ్బంది పెడితే తండ్రి సుమారు రూ.5 లక్షల వరకు తీర్చారు. తిరిగి బెట్టింగ్‌లకు పాల్పడిన అజీజుద్దీన్‌ 22 లక్షల రూపాయల వరకు అప్పులు చేశాడు. అప్పుల వాళ్లు ఒత్తిడి చేయడంతో నాలుగు నెలల కిందట ఉద్యోగం మానేసి ఖమ్మానికి తిరిగొచ్చాడు. అజీజుద్దీన్ వైఎస్‌ఆర్‌ కాలనీలోని సొంతింట్లో ఉంటుండగా.. తల్లిదండ్రులు, సోదరి రోటరీనగర్‌లో అద్దెకు ఉంటున్నారు. 

Also Read: Anand Mahindra: భారత్‌ లో టెస్లా..ఆనంద్‌ మహీంద్రా కీలక వ్యాఖ్యలు!

సొంతింటిని అమ్మి అప్పులు తీర్చాలని తండ్రికి చెప్పగా.. అందుకు కొంత సమయం కావాలని ఆయన అన్నారు. అప్పులవాళ్ల ఒత్తిడి ఎక్కువ కావడంతో నిన్న అర్ధరాత్రి తాను చనిపోతున్నట్లు తండ్రికి అజీజుద్దీన్‌ ఫోన్‌లో వీడియో రికార్డు చేసి పంపాడు. దాన్ని చూసి తల్లిదండ్రులు వచ్చేలోపే అతడు ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం ఖానాపురం హవేలి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమకు అండగా ఉంటాడునుకున్న కొడుకు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read: IT Refunds: రిటర్నులు ఆలస్యమయ్యాయా..అయితే  నో రిఫండ్‌.. ఐటీ శాఖ ఏమందంటే!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sridhar Babu : హెచ్ సీయూ భూములు ప్రభుత్వానివే...మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన

HCU భూముల విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియాను ఉపయోగించుకుని కుట్రలు చేస్తుందని, HCU భూములు ప్రభుత్వానివే అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరికి తెలుసని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అభివృద్ధిని అడ్డుకుని రాష్ట్రసంక్షేమానికి బీఆర్ఎస్ విరోధకంగా మారిందన్నారు.

New Update
D. Sridhar Babu Minister of IT of Telangana

D. Sridhar Babu Minister of IT of Telangana

Sridhar Babu : HCU భూముల విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియాను ఉపయోగించుకుని కుట్రలు చేస్తుందని, HCU భూములు ప్రభుత్వానివే అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరికి తెలుసని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. డివేంచేర్ ట్రస్టీ HCU భూములు ప్రభుత్వానియేనని క్లీయర్ గా చెప్పిందన్నారు.అభివృద్ధిని అడ్డుకుని  రాష్ట్ర సంక్షేమానికి బీఆర్ఎస్ విరోధకంగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాధ్యతాయుతంగా పని చేయాలని మూసీ ప్రక్షాళన చేపట్టామన్నారు. తొమ్మిది ఏండ్ల క్రితం రాజస్థాన్ లో చనిపోయిన జింక పిల్లను HCU లో చనిపోయినట్లు చూపించారు. ఏనుగులు HCU పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు AI ద్వారా చూపించారు.సోషల్ మీడియాను ఉపయోగించుకొని మా ప్రభుత్వం పై కుట్రలు చేస్తున్నారని శ్రీధర్ బాబు ఆరోపించారు.

Also Read :  అనుకున్నదే అయింది.. అఘోరీకి వర్షిణీకి పెళ్లైంది - వీడియో

రాష్ట్రంలో అభివృద్ధి జరగొద్దని అడ్డుకుంటున్నారన్నారు.రూ. 5200 కోట్ల భూమిని 30వేల కోట్లకు చూపించారని కేటీఆర్ అంటుండు. CBI (సెక్యూరిటీ బ్యూరో ఆప్ ఇండియా) అనే రియలేస్టేట్ సంస్థ ద్వారా చేసిన సర్వే ప్రకారం 23వేల కోట్ల వాల్యూ వచ్చింది. దాన్ని SEBI,RBI నిర్దారణ చేసిందన్నారు.ICICI బ్యాంక్ లోన్ ఇవ్వలేదన్నారు.HCU భూమి పై సుప్రీం కోర్టు లో ఏవిధమైన వాద్యాలు లేవని మంత్రి అన్నారు.TGIIC మార్కెట్ ఫోర్ సెస్ ద్వారా 37 అంతర్జాతీయ సంస్థల నుండి ముచువల్ పెట్టుబడులు బాండ్ల ద్వారా ప్రభుత్వం సేకరించిందన్నారు.తక్కువ ఇంట్రెస్ట్ తో ప్రభుత్వ సంక్షేమం కోసం నిధులు సేకరించామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. 5th డిసెంబర్ 2024 లో 9,వేల 995 కోట్ల బాండ్ల ద్వారా ప్రభుత్వం నిధులను సేకరించిందన్నారు.9.35 ఇంట్రెస్ట్ తో నిధులు సేకరణ జరిగిందన్నారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

SEBI లో రిజిస్టర్ అయిన మర్చంట్ బ్యాంకర్ ను TGIIC నియమించుకుంది. ట్రస్ట్ ఇన్వెస్ట్ ఇండస్ట్రీ సంస్థ ఇతర రాష్ట్రాలకు నిధులు సమకూర్చిందని వాటిని రైతుల సంక్షేమం,రైతు భరోసా, రైతు ఋణమాపి ఉపయోగించామని శ్రీధర్ బాబు వివరించారు. REC, PFC BOB నుండి 10.09% కు BRS ప్రభుత్వం అప్పు తీసుకుంది.BRS కంటే కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ ఇంట్రెస్ట్ కు అప్పు తీసుకుందని వివరించారు.TGIIC ద్వారా 8,476,కోట్లు రూపాయలు ప్రభుత్వం తీసుకుందని, వాటిలో ఋణమాపీ కి 2వేల146 కోట్లు, రైతు భరోసా కు 5వేల 463 కోట్లు ఉపయోగించుకుందన్నారు. సన్నబియ్యం కోసం రూ. 947 కోట్లు రూపాయలు ప్రభుత్వం ఉపయోగించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దురదృష్టి తో రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నారని, రాష్ట్ర అభివృద్ధి విషయంలో BRS నేతలు ఎందుకు విషం కక్కుతున్నారని శ్రీధర్ బాబు ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: బీపీ చెక్‌ చేసుకునేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు

Advertisment
Advertisment
Advertisment