/rtv/media/media_files/2025/02/17/ItrMrADbsBu5wrkG7i7T.webp)
Murder Case
Medchal murder : మేడ్చల్ లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. మేడ్చల్‌లో 24 గంటలు గడవకముందే మరో హత్య జరగడం స్థానికంగా కలకలం రేపింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో వ్యక్తిని మెడపై కోసి హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కిస్టాపూర్ రోడ్డు లోని ఓ ఫామ్‌హౌజ్‌లో వెంకట రమణ (32) అనే వ్యక్తిని దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. స్థానికుల సమాచారంతో మేడ్చల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
Also Read: వారి సాయం లేకుండా మేం బతకడం కష్టమే.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు
కాగా వెంకటరమణను ఆయన మేనల్లుడే గొంతుకోసి చంపినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ మృతదేహాన్ని పరిశీలించి క్లూ్స్ టీంకు సమాచారం అందించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా మేడ్చల్ జిల్లాలో గత 15 రోజుల్లో 4 హత్యలు కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వరుస హత్యలు జరుగుతుండటంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. అందులోనూ రక్త సంబంధీకులే హత్యలకు పాల్పడటం చర్చనీయంశంగా మారుతోంది.
Also Read: తీరు మార్చుకోని అగ్రరాజ్యం..మరోసారి సంకెళ్లతోనే వారిని భారత్ కు పంపిన వైనం!
నిన్న మేడ్చల్ పట్టణంలోని బస్ డిపో ఎదుట 44వ నెంబర్ జాతీయ రహదారిపై దారుణ హత్య చోటు చేసుకుంది. మేడ్చల్ బస్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న గన్యా కుమారుడు ఉమేష్(30) ను ఆయన చిన్న కుమారుడు మరో వ్యక్తితో కలిసి హత్య చేశాడు. అయితే.. కుటుంబ కలహాల కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. మద్యానికి బానిసై కుటుంబ సభ్యులపై వేధింపులకు పాల్పడుతుండడంపై విసిగిపోయిన చిన్న కుమారుడు హత్యకు పూనుకున్నట్టు తెలుస్తోంది.
Also Read: రేయ్ ఎవర్రా మీరంతా..! బర్డ్‌ఫ్లూ భయమే లేదు: ఊరంతా చికెన్ పండగే!
Also Read : పోలీసును ఢీకొట్టి బైక్ పై గంజాయితో.....