/rtv/media/media_files/2026/04/10/jeevan-reddy-meet-kcr-2026-04-10-16-09-21.jpg)
Jeevan Reddy meets KCR
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి జీవన్‌రెడ్డి(jeevan-reddy) ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎర్రవెల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.‘‘ అన్నా...నన్ను మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపిండు..’’ అంటూ ఆయన కేసీఆర్‌ను ఆలింగనం చేసుకున్నారు. నిరంతరం తన నియోజకవర్గం, జిల్లా ప్రజలు, రైతుల గురించి ఆలోచన చేసే రైతు నాయకుడు, తెలంగాణ తనానికి దర్పణంగా నిలిచే మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి., తెలంగాణ సాధకుడు రైతు బాంధవుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలయిక సందర్భంగా భావోద్వేగ వాతావరణం నెలకొంది.
అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని
— Telugu Scribe (@TeluguScribe) April 10, 2026
కేసీఆర్‌ను కలిసి భావోద్వేగంతో ఆలింగనం చేసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి pic.twitter.com/lhiH1xYrRM
Also Read : హైదరాబాద్ లో మరో లవ్ జిహాద్... హిందూ అమ్మాయిలే టార్గెట్..
Minister Jeevan Reddy’s Emotional Reaction To KCR
‘‘తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరమున్నదని, మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను మీదగ్గరికి పంపించిండు..అన్నా. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాల్లకైనా మీతో కలిసిపనిచేసే అవకాశం రావడం సంతోషంగా వుంది అన్నా..’’ అంటూ తన మనసులోని మాటను భావోద్వేగంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యక్తం చేశారు. కాగా...జీవన్ రెడ్డిని అనునయిస్తూ,వారిని అప్యాయంగా దగ్గరికి తీసుకున్న కేసీఆర్ , వారిని హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకొని, దుశ్శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. కాసేపు ఇష్టాగోష్టి తర్వాత జీవన్ రెడ్డి బృందాన్ని లంచ్ ఆతిథ్యానికి కేసీఆర్ ఆహ్వానించారు.
కాగా అంతకు ముందు - ఎర్రవెల్లి(erravalli) నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డి కి పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్(KTR - Jeevan Reddy Meeting), మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు.నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి, పుష్పగుచ్ఛాలందించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రులు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డా. కె.సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,రాగిడి లక్ష్మారెడ్డి తదితరులున్నారు. కాగా కేసీఆర్‌ను కలిసిన వారిలో జీవన్ రెడ్డి పాటు ఆయన కుమారులు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ వసంత సురేశ్ దంపతులు తదితరులున్నారు.
Also Read : మేడ్చల్ జిల్లాలో దారుణం.. అన్నదమ్ములతో కలిసి భర్తను హతమార్చిన భార్య..
Follow Us