Allu Arjun: బన్నీకి పదేళ్ల జైలు శిక్ష తప్పదా.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ!

టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 'పుష్ప2' సినిమా సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళా అభిమాని మృతి కేసులో బన్నీని అరెస్ట్ చేశారు. బన్నీకి పదేళ్ల శిక్షపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

New Update
rewrwe

Tollywood : ప్రముఖ తెలుగు నటుడు అల్లు అర్జున్ ను హైదరాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తన తాజా చిత్రం 'పుష్ప-2: ది రూల్' ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. దీంతో రేవతి అనే 35 ఏళ్ల మహిళ చనిపోయింది. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీ తేజ ఊపిరాడక ఆసుపత్రిలో చేరగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌తో పాటు థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) సెక్షన్ 105, 118(1) కింద అల్లు అర్జున్, అతని భద్రతా సిబ్బంది, థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. 

Also Read :  వెంకీ మామ బ్యాక్ టూ ఘర్షణ.. బర్త్ అప్డేట్ అదిరిపోయింది!

Also Read :  'డాకూస్' రేజ్.. బాలయ్య ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!

అసలేం జరిగింది?

డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప 2: ది రూల్' ప్రదర్శనకు అర్జున్ హాజరయ్యారు. సహనటి రష్మిక మందన్నతోపాటు బన్నీ భార్య అల్లు స్నేహా రెడ్డి రావడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరగగా రేవతి అనే మహిళా మృతి చెందింది. దీంతో సంధ్య థియేటర్‌ యజమానుల్లో ఒకరైన ఎం సందీప్‌, సీనియర్‌ మేనేజర్‌ ఎం నాగరాజు, దిగువ బాల్కనీ ఇన్‌ఛార్జ్‌ గంధకం విజయ్‌ చందర్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి: భార్యల వేధింపులకు భర్తలు బలి.. ఎన్ని ఘోరాలు జరిగాయంటే?

బాధిత కుటుంబానికి రూ. 25 లక్షలు


అయితే ఈ ఘటనపై స్పందించిన బన్నీ, డైరెక్టర్ సుకుమార్.. బాధిత కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. వైద్య ఖర్చులు, వారికి అవసరమైనది ఏదైనా భరిస్తానని హామీ ఇచ్చారు. అర్జున్ బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల విరాళం అందిస్తామని చెప్పాడు. మీ కోసం, ముఖ్యంగా పిల్లల కోసం నేను ఉన్నానంటూ బన్నీ భరోసా ఇచ్చాడు. 

Also Read :  మద్యం మత్తులో మంచు మనోజ్‌ గొడవ?

డ్రెస్ మార్చుకునే అవకాశం ఇవ్వలేదా..


సంథ్య థియేటర్ ఇష్యూలో పోలీసులు అరెస్ట్ చేయడంపై నటుడు అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశాడు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అరెస్టు చేశారన్నాడు. బెడ్ రూమ్ లోకి వచ్చి అదుపులోకి తీసుకున్నారని, కనీసం బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వలేదని వాపోయాడు.  ఉన్నపళంగా తమతో రావాలని చెబితే ఎలా అంటూ ప్రశ్నించాడు. పోలీసులు తీసుకెళ్లడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే బన్నీ కోరిక మేరకు డ్రెస్ మార్చుకునే అవకాశం ఇచ్చామని పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు