Allu Arjun: సంథ్య థియేటర్ ఇష్యూలో పోలీసులు అరెస్ట్ చేయడంపై నటుడు అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశాడు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అరెస్టు చేశారన్నాడు. బెడ్ రూమ్ లోకి వచ్చి అదుపులోకి తీసుకున్నారని, కనీసం బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వలేదని వాపోయాడు. ఉన్నపళంగా తమతో రావాలని చెబితే ఎలా అంటూ ప్రశ్నించాడు. పోలీసులు తీసుకెళ్లడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే బన్నీ కోరిక మేరకు డ్రెస్ మార్చుకునే అవకాశం ఇచ్చామని పోలీసులు తెలిపారు. View this post on Instagram A post shared by RTV News (@rtvnewsnetwork) నాంపల్లి కోర్టులో హాజరు.. వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నారు. అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు.