సారీ చెప్పినా తగ్గేదేలే.. సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్న నాగార్జున మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పిన వెనక్కి తగ్గేదిలేదని నాగార్జున ఆమెపై సీరియస్ అయ్యారు. లీగల్ నోటీసులు పంపడానికి ఇప్పటికే లీగల్ టీమ్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. By Kusuma 03 Oct 2024 | నవీకరించబడింది పై 03 Oct 2024 12:14 IST in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి మంత్రి కొండా సురేఖపై అక్కినేని నాగార్జున మండిపడ్డారు. నాగ చైతన్య, సమంత విడాకుల విషయంలో సురేఖ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ ఆమె క్షమాపణలు చెప్పారు. అయిన కూడా నాగార్జున వెనక్కి తగ్గకుండా లీగల్ నోటీసులు పంపాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఇది కూడా చూడండి: ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే.. నేటి నుంచి ప్రారంభం లీగల్ టీమ్‌తో.. ఇప్పటికే లీగల్ టీమ్‌తో నాగార్జున చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున వైజాగ్‌లో ఉన్నారు. హైదరాబాద్ వచ్చిన వెంటనే చట్టపరంగా నోటీసులు పంపించడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదని, చట్టపరంగా నాగార్జున పోరాడనున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: కొండా సురేఖపై స్మిత సబర్వాల్ సంచలన పోస్టు.. ఏం అన్నారంటే? తెలంగాణ మంత్రి కొండా సురేఖ సమంత, నాగచైతన్యపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సినీ, రాజకీయ నాయకులు నుంచి విమర్శలు రావడంతో ఆమె సమంతకు సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కూడా తెలిపారు. సమంత మనోభావాలను దెబ్బ తీయడం నా ఉద్దేశం కాదు.. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. #konda-surekha #samantha #akkineni-nagarjuna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి