BIG BREAKING: తెలంగాణలో సీఎం మార్పు

తెలంగాణలో సీఎం మార్పుపై బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇప్పటికే తెలంగాణ ఇన్‌ఛార్జ్ ను మార్చిందన్నారు. నెక్స్ట్ సీఎం రేవంత్ ను మార్చనుందని జోస్యం చెప్పారు.

New Update
Telangana CM Revanth reddy

తెలంగాణలో సీఎం మార్పుపై బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే తెలంగాణ ఇన్‌ఛార్జ్ ను మార్చిందన్నారు. నెక్స్ట్ సీఎం రేవంత్ ను మార్చనుందని జోస్యం చెప్పారు. కొత్త ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు కాంగ్రెస్ హైకమాండ్ సీఎంను మార్చాలన్న టాస్క్ ఇచ్చిందన్నారు. మిషన్ సీఎం ఛేంజ్ అనే టాస్క్ ను కాంగ్రెస్ నటరాజన్ కు అప్పజెప్పిందన్నారు. తెలంగాణ కేబినెట్ లో కలహాలు ఉన్నాయన్న వార్తలు కథలు కథలుగా వినిపిస్తున్నాయన్నారు. ఎవరికివారే యమునా తీరే మాదిరిగా కేబినెట్ మంత్రుల వ్యవహారం సాగుతోందన్నారు.

నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆడబిడ్డల ఆశీర్వాదం కావాలని అడిగారన్నారు. సీఎంకు కావాల్సింది ఆడబిడ్డల ఆశీర్వాదం కాదన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన మహిళ ఆశీర్వాదం ఆయనకు కావాలని ఎద్దేవా చేశారు. తన బతుకు ఆగంలో ఉందని సీఎం రేవంత్ కు అర్థమైందన్నారు. మీనాక్షి నటరాజన్ దయా దక్షిణ్యాల మీదే సీఎం గా రేవంత్ కొనసాగనున్నారన్నారు. నటరాజన్ సీఎం మార్చే గ్రౌండ్ ప్రిపరేషన్ లో ఉందన్నారు. ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న ఒక్క మినిస్టర్ ను సీఎం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ చూస్తోందన్నారు.  

ప్రతి విషయంలో సీఎం రేవంత్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ ఎక్కడిక్కడ చెక్ పెడుతున్నాడన్నారు. ఇక్కడ జరిగే ప్రతి అంశాన్ని ఢిల్లీకి చెరవేసేది ఉత్తమేనని కాంగ్రెస్ నేతలు అంటున్నారన్నారు. రేవంత్ కు రాహూల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకపోవడంలో ఉత్తమ్ కీలక పాత్ర పోషించారన్న టాక్ నడుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏలేటి. మున్షీ స్థానంలో నటరాజన్ ఇన్‌ఛార్జిగా రావడంలో మాస్టర్ ప్లాన్ వేసింది ఉత్తమేనన్నారు. పాత ఇన్ఛార్జ్ రేవంత్ కు అనుకూలంగా ఉందని హై కమాండ్ కు ఉత్తమ్ కంప్లైంట్ చేశాడన్నారు.

సీఎంతో పాటు ఉత్తమ్, పొంగులేటి కప్పం..

సీఎంతో పాటు ఉత్తమ్, పొంగులేటి కప్పం కడుతున్నారన్నారు. దీంతో వీరి శాఖల్లో వేలు పెట్టొద్దని రేవంత్ కు కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఉత్తమ్ శాఖలో విపరీతమైన అవినీతి నడుస్తోందన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పీ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడన్నారు. రాష్ట్రంలో అత్యధిక టాక్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వసూలు చేస్తున్నాడన్నారు. డిస్ప్యూట్ భూమిలో 50 శాతం పర్సంటేజ్ తీసుకుంటున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేసి 50 శాతం ట్యాక్స్‌ తీసుకుంటున్నాడన్నారు. 

Advertisment
Advertisment
Advertisment