BIG BREAKING: ఉత్తమ్, సీతక్కకు కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు మంత్రి సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలను అప్పగించింది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ వీరిని పరిశీలకులుగా నియమించింది. మరఠ్వాడ ప్రాంతానికి ఉత్తమ్, నార్త్ మహారాష్ట్రకు సీతక్కను అబ్జర్వర్లుగా నియమించింది. By Nikhil 15 Oct 2024 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి మంత్రి సీతక్క (Minister Seethakka), ఉత్తమ్ కుమార్ రెడ్డికి (Uttam Kumar Reddy) కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలను అప్పగించింది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు (Maharashtra Elections) జరగనున్న వేళ వీరిని సీనియర్ అబ్జర్వర్లుగా నియమించింది. మరఠ్వాడ ప్రాంతానికి ఉత్తమ్, నార్త్ మహారాష్ట్రకు సీతక్కను అబ్జర్వర్లుగా నియమించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఆదేశాలతో ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.ఇది కూడా చదవండి: BIG BREAKING: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ Congress President Shri @kharge has appointed AICC Senior Observers (Division- wise) and State Election Senior Coordinators for Maharashtra, as follows, for the ensuing assembly elections in the state, with immediate effect. pic.twitter.com/syuSm3ZiTE — Congress (@INCIndia) October 15, 2024 భట్టికి ఝార్ఖండ్ బాధ్యతలు.. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు సైతం కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలను అప్పగించింది. ఝార్ఖండ్ కు ఆయనను సీనియర్ అబ్జర్వర్ గా నియమించింది. దీంతో ఈ నేతలు ఆయా రాష్ట్రాలకు వెళ్లి ఎన్నికలు ముగిసే వరకు పార్టీ శ్రేణులను సమన్వయం చేయనున్నారు. టికెట్ల కేటాయింపు దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం ముగిసే వరకు వీరికి కేటాయించిన ప్రాంతాల్లో పని చేయనున్నారు. ఇది కూడా చదవండి: Revanth Reddy: అక్కా.. కొంచెం తగ్గు: కొండా సురేఖకు రేవంత్ క్లాస్! Hon'ble Congress President Shri @kharge has appointed the following leaders as AICC Senior Observers for Jharkhand for the upcoming assembly elections in the state, with immediate effect. pic.twitter.com/VhoUp9aLeQ — Congress (@INCIndia) October 15, 2024 ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది. నవంబర్ 20న మహారాష్ట్ర ఎన్నికలు నిర్వహించి 23న ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఝార్ఖండ్ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. నవంబర్ 13న ఫస్ట్ ఫేజ్, 20న సెకండ్ ఫేజ్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాలను సైతం నవంబర్ 23న విడుదల చేయనుంది. మహారాష్ట్రలో మొత్తం 288, ఝార్ఖండ్ లో 81 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 5తో ఝార్ఖండ్ అసెంబ్లీకి, నవంబర్ 26తో మహారాష్ట్ర అసెంబ్లీకి గడువు ముగియనుంది. ఇది కూడా చదవండి: TTD:తిరుమలకు వెళ్లే భక్తులకు అలెర్ట్.. వర్షాల నేపథ్యంలో దర్శనాలు రద్దు ఇది కూడా చదవండి: ఏపీలో ఆ నగర వాసులకు కేంద్రం గుడ్‌న్యూస్.. సీఎం కృతజ్ఞతలు #uttam-kumar-reddy #mallikarjun-kharge #minister-seethakka #maharashtra-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి