IMD: నాలుగు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..ఐఎండీ హెచ్చరికలు!
నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది.
నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ డీకే శివకుమార్ అంటూ బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటికి కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టు పనులు రావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాత్ర ప్రభుత్వంలో నామమాత్రమేనన్నారు.
మంచిర్యాల జిల్లాలో జితేంద్ర అనే బాలుడు రామకృష్ణాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు తన సోదరిమణులతో రాఖీలు కట్టించుకునేందుకు వెళ్లగా పాఠశాల సిబ్బంది అనుమతించలేదు. దీంతో తండ్రి భుజాలపైకి ఎక్కి కిటికీలో నుంచి తన అక్కలతో రాఖీ కట్టించుకున్నాడు.
తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం తమిళనాడు నుంచి రాయలసీమ పరిసర ప్రాంతాల వరకు విస్తరించి ఉందని అధికారులు పేర్కొన్నారు.
అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరగనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల సమయాల్లో టీజీపీఎస్సీ మార్పులు చేసింది. గతంలో నిర్ణీత తేదీల్లో మధ్యాహ్నం 2.30 PM నుంచి సాయంత్రం 5.30 PM గంటల వరకు నిర్ణయించగా.. ఇప్పుడు 2.00 PM నుంచి 5.00 PM గంటలకు మార్చింది.
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నట్లు వివరించారు.
తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.రాయలసీమ మీదుగా విస్తరించిన ద్రోణి ప్రస్తుతం తెలంగాణ మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని ఆనుకొని కేరళ తీరం వరకు వ్యాపించిందని అధికారులు తెలిపారు.
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది.భారీ వర్షాలు పడే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
సుంకిశాల ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కుప్పకూలడం సంచలనం రేపుతోంది. మేఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.