![Khammam](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/02/10/BssXoSWfyMQ9EXPpQ0U9.jpg)
Khammam
Khammam Crime: విడాకుల కోసం లాయర్(Lawyer) దగ్గరికి వెళ్తే న్యాయం చేయాల్సింది పోయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి కడపు చేశాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.హైదరాబాద్ కు చెందిన బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం భద్రాధ్రికొత్తగూడెం జిల్లాకు చెందిన ఓవ్యక్తితో యువతికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసైన భర్త తరచూ తాగి వేధింపులకు గురిచేస్తుండటంతో భర్తతో వివాహబంధాన్ని తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకుంది. భర్త నుంచి విడాకులు కోసం భధ్రాచలంకు చెందిన యువ న్యాయవాది భరణి వెంకట కార్తీక్ ను సంప్రదించింది. ఆ యువతి కేసును స్వీకరించిన వెంకటకార్తీక్ కొద్ధికాలం భర్తకు దూరంగా ఉండాలని యువతికి సూచించాడు.
Also Read : ఇది చారిత్రాత్మకమైన తీర్పు.. ఢిల్లీ రిజల్ట్స్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్!
లాయర్ సూచనతో తన కుమారుడితో కలిసి ఆ యువతి అద్దె ఇంట్లో ఒంటరి జీవనం సాగించింది. కేసు విషయమై మరోసారి లాయర్ కార్తీక్‌ను సంప్రదించింది. డైవర్స్ విషయం తాను చూసుకుంటానని తన కామవాంఛ తీర్చాలంటూ కార్తీక్ ఆ యువతిని కోరాడు.అంతటితో ఆగకుండా ప్రేమిస్తున్నానంటూ.. పెళ్లికూడా చేసుకుంటానంటూ యువతి వెంటపడ్డాడు.యువతి బలహీన క్షణాలను ఆసరాగా చేసుకుని లాయర్ ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు.దీంతో ఆమె గర్భం దాల్చింది.
Also Read : ఢిల్లీ ఫలితాలపై కోమటిరెడ్డి రియాక్షన్.. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్!
పరారీలో లాయర్ కార్తీక్...
గర్భం దాల్చడంతో యువతి మనోవేదను గురైంది. తన ఇంట్లో వాళ్లకు తెలిస్తే పరువుపోతుందని తనను వివాహం చేసుకోవాలని కార్తీక్ ను కోరిందా యువతి. చేసుకుంటానని కొంతకాలం నమ్మించిన కార్తీక్ ఆ తర్వాత ముఖం చాటేశాడు. గట్టిగా నిలదీయడంతో యువతి గర్భంతో తనకేం సంబంధం లేదని లాయర్ కార్తీక్ ముఖం మీదే చెప్పాడు. లాయర్ కార్తీక్ వైఖరితో మరోమారు మనోవేదనకు గురైన బాధిత యువతి ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో యువ లాయర్ భరణి వెంకట కార్తీక్ పై కేసు నమోదు చేసిన భద్రాచలం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో లాయర్ కార్తీక్ పరారీలో ఉన్నాడు. కాగా కేసును వెనక్కి తీసుకోవాలంటూ బాధితురాలుపై నిందితుడు కార్తీక్ సహచరులు ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆరోపించింది. కాగా తనకు న్యాయం చేయాలంటూ యువతి వేడుకుంటోంది.
Also Read: ఏకంగా బౌన్సర్లను పెట్టి మరీ గెంటెస్తున్న టెక్ కంపెనీలు
Also Read: కాంగ్రాట్స్ రాహుల్.. ఢిల్లీ ఫలితాలపై ట్విట్టర్లో కేటీఆర్ సెటైర్లు!