/rtv/media/media_files/2026/04/08/singareni-2026-04-08-16-49-41.jpg)
Rape of a female apprentice in singareni
Crime News : తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందిన సింగరేణి సంస్థలో మైనింగ్ అప్రెంటీస్ చేయడానికి వచ్చిన యువతిపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సింగరేణి సంస్థలో ఒకపుడు మగవారికి మాత్రమే అవకాశం ఉండేది. అయితే గత కొన్నాళ్లుగా మహిళలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. పలువురు మైనింగ్ చదివిన యువతులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ మైనింగ్ చదివిన యువతి సింగరేణి రామగుండం రీజియన్ లోని ఆర్టీవన్ పరిధి 2వ ఇంక్లయిన్ గనిలో అప్రెంటీస్ చేయడానికి వచ్చింది.
అయితే అదే గనిలో ఓవర్ మెన్ గా పని చేస్తున్న రవి అనే సూపర్ వైజర్ గనిలో తనను వేధింపులకు గురిచేయడంతో పాటు బలత్కారానికి పాల్పడ్డాడని సదరు యువతి గని యాక్టింగ్ మేనేజర్ జాన్సన్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. దీంతో కార్మిక వర్గం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సింగరేణి యాజమాన్యం మహిళల సంరక్షణకు పగడ్భందీ చర్యలు తీసుకుంటుందని, మహిళా కార్మికుల సేవలను అండర్ గ్రౌండ్ లో సైతం వినియోగించుకోవాలని ఆలోచిస్తున్న తరుణంలో ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడం తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది.
కాగా, మహిళల సంరక్షణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసిన సింగరేణి యాజమాన్యం ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని కార్మికులు చర్చించుకుంటున్నారు. కాగా, ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓవర్ మెన్ రవి గుర్తింపు సంఘం నాయకుడు కూడా కావడం స్థానికంగా సంచలనంగా మారింది.
Follow Us