రామ రామ.. రాముడి పేరుతో భక్తులకు పంగనామం!

పాలకుర్తి నియోజకవర్గంలోని వల్మిడి దేవస్థానం పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. సీతారాముల కళ్యాణం టికెట్లు, ఆలయ చందాల పేరుతో నకిలీ రశీదులు, బుక్కులు ముద్రించి ఈవో సంతకాలు ఫోర్జరీ చేశాడు. వాటిని భక్తులకు అమ్ముకుని డబ్బులు బాగానే దండుకున్నాడు.

New Update
lord-rama cheating

lord-rama cheating

తప్పులు చేసి దేవుడా పలానా తప్పు చేశా క్షమించు తండ్రి అంటూ రెండు చేతులు జోడించి  క్షమాపణలు వేడుకోవడం మనుషుల నైజం.  కానీ ఇక్కడకో వ్యక్తి ఏకంగా దేవుడి పేరు మీదే తప్పులు చేశాడు. దేవుడి పేరుతో భక్తులకు పంగనామం పెట్టాడు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని వల్మిడి దేవస్థానం పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు.  సీతారాముల కళ్యాణం టికెట్లు, ఆలయ చందాల పేరుతో నకిలీ రశీదులు, బుక్కులు ముద్రించి ఈవో, దేవస్థానం అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశాడు. వాటిని భక్తులకు అమ్ముకుని డబ్బులు బాగానే దండుకున్నాడు.  అయితే ఈ విషయం కాస్త దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి వెళ్లడంతో వెంటనే విచారణకు ఆదేశించారు. గతంలో దేవాలయ ధర్మకర్తగా పని చేసిన రవి అనే వ్యక్తి ఈ వసూళ్లకు పాల్పడినట్లుగా విచారణలో తేలింది.  దీంతో రవిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఆలయ అధికారులు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారు.  

హైదరాబాద్లో వైన్ షాపులు బంద్

మద్యం ప్రియులకు హైదరాబాద్ పోలీసులు బిగ్ షాకిచ్చారు. 2025 ఏప్రిల్ 06వ తేదీ ఆదివారం రోజున శ్రీరామనవమి సందర్భంగా  వైన్ షాపులు బంద్ చేయాలని రాచకోండ పోలీస్ కమిషనర్ రేట్ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరామనవమి పండుగ సందర్భంగా.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని పరిధిలోకి కల్లు, వైన్ షాపులు, రెస్టారెంట్ల అనుబంధ బార్లు, మిలిటరీ కాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్ దీని పరిధిలోకి వస్తాయి. ఈ విషయాన్ని అందరూ గమనించాలని రాచకొండ పోలీసులు కోరారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

Also read: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

 Also read: Telangana : గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

భద్రాధ్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం జడ్ వీరభధ్రాపురంలో చేతబడి నెపంతో సొంత బాబాయినే కిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు. తన బాబాయి కొమరం రాముడు చేతబడి చేయడం వల్లే తన ఇంట్లో వారు వరుసగా ఏదోకారణం చేత మృతిచెందుతున్నారని అనుమానం పెంచుకుని హత్య చేశాడు.

New Update
 A young man murdered his own uncle

A young man murdered his own uncle

 TG Crime :  ఖమ్మంలో అమానుష ఘటన జరిగింది. భద్రాధ్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం జడ్ వీరభధ్రాపురంలో చేతబడి నెపంతో సొంత బాబాయినే కిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు. తన బాబాయి కొమరం రాముడు చేతబడి చేయడం వల్లే తన ఇంట్లో వారు వరుసగా ఏదోకారణం చేత మృతిచెందుతున్నారని అనుమానం పెంచుకున్న కొమరం వెంకటేష్.. సొంత బాబాయి కొమరం రాముడిని హత్యచేసేసేందుకు పథకం రచించాడు. గత నెల 11వతేదీన భార్య కొమరం లక్ష్మీదేవితో కలసి కొమరం రాముడు అదే గ్రామంలోని బంధువుల పెళ్లికి వెళ్లాడు.

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!


 పథకం ప్రకారం మద్యం ఆశచూపి కొమరం రాముడిని గ్రామ శివారులోని చెరువు కట్టకు రప్పించాడు కొమరం వెంకటేష్. మద్యం మత్తులో ఉన్న కొమరం రాముడిని తన బామ్మర్థి బద్దం బాలరాజు సాయంతో వైరుతో గొంతునులిమి హత్యచేశాడు. అనంతరం మృతదేహాన్ని గన్నీసంచిలో కూర్చి చెరువులో పడేశారు. అయితే పెళ్లికి తనతో వచ్చిన భర్త కనిపించకపోవడంతో అంతటా వెతికిన భార్యకు జాడ తెలియలేదు. దీంతో తన భర్త కనిపించడం లేదంటూ గత నెల 16వ తేదీన దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది భార్య కొమరం లక్ష్మీదేవీ. 

Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..

భార్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు, కేసు నమోదు చేసిన మూడు వారాల్లో దుమ్ముగూడెం సీఐ అశోక్ మిస్సింగ్ కేసు మిస్టరీని చేధించారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో  గ్రామస్థుల సాయంతో మృతుడు కొమరం రాముడి మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీయించారు.  మిస్సింగ్ కేసును హత్యకేసుగా మార్చి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం భధ్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్

Also read: BIG BREAKING: ‘సింగపూర్‌లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రధాని మోదీ సాయం’

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు