/rtv/media/media_files/2026/02/26/telangana-2026-02-26-15-15-32.jpg)
గత దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల భారం గణనీయంగా పెరిగింది. 2014లో రాష్ట్రం ఏర్పడిన నాటితో పోలిస్తే, ప్రస్తుతం వేతనాల కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు దాదాపు నాలుగు రెట్లు పెరిగి నెలకు రూ. 6 వేల కోట్లకు చేరుకుందని సీనియర్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
విద్యుత్ సంస్థ(TGGENCO) ల్లో పనిచేసే టాప్ లెవల్ చీఫ్ ఇంజనీర్లు నెలకు రూ. 7 లక్షల వరకు జీతం అందుకుంటున్నారు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే పే-రివిజన్ల కారణంగా వీరి వేతనాలు ఈ స్థాయికి చేరాయి. జీహెచ్ఎంసీలో పనిచేసే రెగ్యులరైజ్డ్ సీనియర్ క్లాస్-4 కార్మికులు (స్వీపర్లు)(GHMC Senior Sweepers Salary), సుదీర్ఘ సర్వీసు ఉన్నవారు నెలకు దాదాపు రూ. 2 లక్షల వరకు వేతనం పొందుతున్నారు. సాధారణ పారిశుద్ధ్య కార్మికుల సగటు జీతం రూ. 70,000 ఉండగా, ఎంట్రీ లెవల్ సిబ్బందికి రూ. 28,000 అందుతోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం కరువు భత్యం ప్రాథమిక వేతనంలో 33.67 శాతంగా ఉంది. వివిధ గ్రూపుల వేతనాల వివరాలు ఒకసారి చూస్తే..
గ్రూప్ 1: రూ. 80,000 నుండి రూ. 1.5 లక్షల పైచిలుకు.
గ్రూప్ 2: రూ. 60,000 నుండి రూ. 1.2 లక్షల వరకు.
గ్రూప్ 4: ఎంట్రీ లెవల్లో రూ. 35,000 నుండి రూ. 50,000 వరకు.
Also Read : జూబ్లీహిల్స్ మెట్రోస్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం
కాగ్ వెల్లడించిన వివరాల ప్రకారం..
రాష్ట్ర ఆదాయంలో సుమారు 45 శాతం వాటా కేవలం జీతాలు, పెన్షన్లు, అప్పుల వడ్డీలకే సరిపోతోంది. అయినప్పటికీ, తెలంగాణ జీఎస్డీపీ 10 శాతం కంటే ఎక్కువ వృద్ధి రేటుతో ఉండటం, తలసరి ఆదాయం దేశంలోనే అగ్రస్థానంలో ఉండటంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, వేతనాల చెల్లింపులను సమర్థవంతంగా నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు. 2025-26 బడ్జెట్లో విద్యకు రూ. 23,108 కోట్లు, ఎస్సీ/ఎస్టీ సంక్షేమానికి రూ. 57,401 కోట్లు కేటాయించారు. ఎన్నికల సమయంలో వరుసగా వేతన సవరణలు జరగడం వల్లే ఈ అధిక వేతనం లభిస్తోందని, దీనివల్ల స్థిర వ్యయం పెరిగిందని అధికారులు తెలిపారు.
Also Read : కుమ్మెర ఘటనలో బిగ్ ట్విస్ట్.. పాప పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఏం ఉందో తెలుసా?
Follow Us