గంటకు ఒకరు మృతి.. వామ్మో, తెలంగాణలో రోజుకు ఎన్ని యాక్సిడెంట్లో తెలుసా?

నిత్యం యాక్సిడెంట్లతో రాష్ట్రంలోని రోడ్లు రక్తంతో తడిసి ముద్దవుతున్నాయి. ఈ ఏడాది 9 నెలల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు సగటున 70 ప్రమాదాలు జరిగాయి. అందులో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్సిడెంట్లలో మరణిస్తున్న వారిలో 68శాతం మంది యువతే ఉంటున్నారు.

New Update
road accident,

రాష్ట్రవ్యాప్తంగా రోజు రోజుకూ ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అధిక స్పీడ్, నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. నిత్యం యాక్సిడెంట్లతో రోడ్లు రక్తసిక్తం అవుతున్నాయి. ఒక్కోసారి యాక్సిడెంట్‌లో ఒకరు ఇద్దరు మాత్రమే కాదు.. ఏకంగా పదుల సంఖ్యలో చనిపోతున్నారు. దీంతో రోడ్లపై జర్నీ చేయాలంటే ప్రజలు హడలిపోతున్నారు. ఏ సమయంలో ఏం జరుగుతుందో అని ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుట్టున్నారు. 

ఇది కూడా చదవండి: షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా?

రోడ్డు ప్రమాదంలో 68 శాతం మంది యువతే

రీసెంట్‌గానే మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 7 మంది మృతి చెందారు. ఇలా ప్రతి రోజూ పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే దీనిపై పోలీస్ శాఖ ఎన్నెన్ని నిబంధనలు పెట్టినా ఎవరూ పాటించడం లేదు. 

ఇది కూడా చదవండి: Isha ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట

మరెన్నో కఠిన చర్యలు తీసుకున్నా.. పట్టించుకోవడం లేదు. అందులో ఎక్కువగా యువతే ఉంటున్నారు. హెల్మెట్ వాడకపోవడం, అధిక స్పీడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్.. ఇలా ప్రతీ రూల్స్‌ను పెడచెవిన పెట్టేస్తున్నారు. దీని కారణంగానే యాక్సిడెంట్లలో మరణిస్తున్న వారిలో దాదాపు 68 శాతం మంది యువతే ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. 

 రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు సగటున 70 ప్రమాదాలు

కాగా ఈ సంవత్సరం కేవలం 9 నెలల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో యాక్సిడెంట్లు అయ్యాయి. అందులో ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా.. మరెంతో మంది గాయాలపాలయ్యారు. ఈ 9 నెలల వ్యవధిలో రాష్ట్రంలో మొత్తం 18,991 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో 5,606 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 17,689 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీని బట్టి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు సగటున 70 ప్రమాదాలు జరుగగా.. 21 మంది ప్రాణాలు విడిచారు.

ఇది కూడా చదవండి: DPT అంటే దోచుకో, పంచుకో, తినుకో: చంద్రబాబుపై జగన్ ఫైర్

గతేడాదితో పోలిస్తే 2,075 ప్రమాదాలు ఎక్కువ

అయితే గతేడాది కంటే ఈ ఏడాది యాక్సిడెంట్ల సంఖ్య భారీగా పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే 2,075 ప్రమాదాలు ఎక్కువ. ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీగా ఉండే గ్రేటర్ హైదరాబాద్‌లో ఎక్కువ యాక్సిడెంట్లు జరిగాయి. హైదరాబాద్‌లోని దాదాపు మూడు కమిషనరేట్ల పరిధిలో 7,168 యాక్సిడెంట్లు జరిగాయి. ఈ యాక్సిడెంట్లలో 1,380 మంది ప్రాణాలు విడిచారు.

అలాగే దీని తర్వాత వరంగల్ కమిషనరేట్ పరిధిలో 1,027 ప్రమాదాలు జరిగాయి. అందులో 328 మంది చనిపోగా.. 1,019 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇలా రోజు రోజుకు ప్రమాదాలు పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీని బట్టి చూస్తే గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో ఎప్పటిలాగే రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది. దీని తర్వాత స్థానంలో వరంగల్ నిలిచింది. 

ఇది కూడా చదవండి: Vivo Y19s: వివో నుంచి కిక్కిచ్చే కొత్త ఫోన్.. ఫీచర్లు మామూలుగా లేవు !

ఎక్కువగా ఈ సమయాల్లో యాక్సిడెంట్లు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ ఉండే సమయంలోనే అంటే ఉదయం 8 - 11గంటలు.. అలాగే సాయంత్రం 6 - 8 గంటల మధ్యలో ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అంతేకాకుండా రాత్రి 11 గంటల తర్వాత టూ వీలర్‌పై వెళ్లే వారు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు అని పోలీస్ కేస్ స్టడీస్‌ చెప్తున్నాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు