Hyderabad: యాసిడ్‌తో అల్లం పేస్ట్‌...ప్రముఖ హోటళ్లకు ఇదే సరఫరా!

తాజాగా హైదరాబాద్ నగరవాసులు ఉలిక్కిపడేలా చేసే కల్తీ బాగోతం బయటపడింది.1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును అధికారులు బోయినపల్లి లో సీజ్ చేశారు. ఈ కేటుగాళ్లు దీనిని అంతటిని నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తుండడం గమనార్హం

New Update
gingerpstw

Hyderabad:హైదరాబాద్‌ నగర వాసులు ఉలిక్కిపడే ఘటన మరొకగొ వెలుగులోకి వచ్చింది. జంట నగరాల్లో ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో లొట్టలేసుకుంటూ తినే ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలిస్తే వామ్మో ఇంత కాలం మనం తింటుంది...అల్లం పేస్టునా..లేక యాసిడ్‌ నా అని గుండెలు చేత్తో పట్టుకుంటారు. గత కొంత కాలంగా పదే పదే అల్లం వెల్లుల్లి పేస్టుల కల్తీ సంఘటన గురించిన వార్తలు చాలా వెలుగులోకి వచ్చాయి. వాటిని మనం అంతా చూసిన సంగతి తెలిసిందే.

Also Read:  Andhra Pradesh: ఉన్నత పాఠశాలల సమయం గంట పెంపు!

ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి.. కల్తీలు జరుగుతున్నాయని.. ఆ కల్తీ సరుకు హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్తోందని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూమా మనం అలాంటి కల్తీ సరుకు వాడే హోటళ్లలోకి వెళ్లట్లేదు.. అలాంటి దరిద్రాన్ని వాడే రెస్టారెంట్లలోని ఫుడ్ తినట్లేదని అనుకుంటున్నారు.

Also Read: TS: లగచర్లకు ఎస్టీ కమిషన్..

అయితే.. అధికారుల దాడుల్లో ఇన్ని రోజులు 10 కిలోల నుంచి మొదలు 100 కిలోల వరకు కల్తీ అల్లం వెల్లుల్లిని సీజ్ చేసిన కేసులు మాత్రమే ఉన్నాయి. ఒకటో రెండో సందర్భాల్లో 300 కిలోలు కూడా సీజ్ చేశారు. కానీ.. ఈసారి మాత్రం అంతకు మించి.. ఏకంగా 1500 కిలోల అల్లం వెల్లుల్లి పేస్టును అధికారులు సీజ్ చేయటం ఇప్పుడు అంతటా ఆందోళన కలిగిస్తోంది. 

Also Read: MH: కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి సీఎం రేవంత్ కౌంట‌ర్

ప్రముఖ హోటళ్లు, ఫేమస్ రెస్టారెంట్లకే...

అయితే.. ఈ టన్నుల కొద్దీ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును ప్రముఖ హోటళ్లు, ఫేమస్ రెస్టారెంట్లకే సరఫరా వేస్తున్నారన్న విషయం మరింత షాకింగ్‌ విషయమే.  తాజాగా.. సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లిలో భారీ ఎత్తున కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అధికారులు పట్టుకున్నారు. బోయిన్‌పల్లిలోని రాజరాజేశ్వరి నగర్‌లో ఖార్కానాలో "సోనీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌" పేరుతో ఈ కల్తీ బాగోతాన్ని నడిపిస్తున్నారు. ఆదివారం  కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌, బోయిన్‌పల్లి పోలీసులు సంయుక్తంగా తయారీ యూనిట్‌పై దాడులు నిర్వహించారు. 

Also Read: డబుల్ ఇంజిన్ అంటే ప్రధాని, అదాని.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ఈ దాడుల్లో 1500 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుబడగా.. మరో నాలుగున్నర లక్షలు విలువ చేసే మెటీరియల్ ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. సోనీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ యజమాని మహ్మద్ షకీల్ అహ్మద్ పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

అయితే.. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ బాగోతం బయటపడటం ఒక ఎత్తయితే.. ఈ దరిద్రాన్ని ఇన్నిరోజులు ఎక్కడెక్కడికి సరఫరా చేశారనే తెలిస్తే.. పై ప్రాణాలు పైనే పోతుంటాయి. జంట నగరాల్లో ఉన్న ప్రముఖ హోటళ్లు, ఫేమస్ రెస్టారెంట్లే వీళ్ల కస్టమర్లని తెలుస్తుంది. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లే టార్గెట్‌గా ఈ దందా నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇప్పుడు పట్టుబడిందే 1500 కిలోలంటే.. ఇన్ని రోజులు టన్నులకు టన్నుల ఈ దరిద్రాన్నే పేరు మోసిన హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేసి ఉంటారని తెలుస్తుంది. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Smita Sabharwal : HCU భూముల వ్యవహారం.. స్మితా సబర్వాల్‌కు సీఎం రేవంత్‌ సర్కార్ బిగ్‌ షాక్‌

స్మితా సభర్వాల్ కు పోలీసులు బిగ్ షాకిచ్చారు.  కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఆమెకు నోటీసులు పంపించారు. సోషల్ మీడియాలో కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవి ధ్వంసానికి సంబంధించిన ఓ ఏఐ రూపొందించిన ఫేక్ ఫోటోను ఆమె షేర్ చేశారు.

New Update
snmitha ias

snmitha ias

తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ కు పోలీసులు బిగ్ షాకిచ్చారు.  కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఆమెకు నోటీసులు పంపించారు.  సోషల్ మీడియాలో కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవి ధ్వంసానికి సంబంధించిన ఓ ఏఐ రూపొందించిన ఫేక్ ఫోటోను ఆమె షేర్ చేయడమే ఇందుకు కారణం. 2025 మార్చి 31వ తేదీన  ‘Hi Hyderabad’ అని ఎక్స్ వేదికగా షేర్ చేయబడింది. ఇది మష్రూమ్ రాక్ వద్ద బుల్‌డోజర్లు, వాటిని చూస్తున్న నెమలి, జింక లాంటి జంతువులతో జిబ్లి స్టైల్‌లో రూపొందించబడినదిగా ఉంది. 

ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ఏఐ వీడియోలు, చిత్రాల ద్వారా సోషల్ మీడియాలో విస్తృతంగా తప్పుడు ప్రచారం చేశారని, వీరి వెనుక ప్రతిపక్ష పార్టీలకు చెందిన పెద్దలు ఉన్నారని ప్రభుత్వానికి నిఘా వర్గాలు నుంచి సమాచారం అందింది. ఈ క్రమంలో ఫేక్ ప్రచారానికి పాల్పడిన ఆయా యూట్యూబ్ చానళ్లు, న్యూస్ వెబ్ సైట్లతో పాటు పలువురు నెటిజన్లకు పోలీసులు నోటీసులు అందిస్తున్నారు. అందులో భాగంగానే ఎక్స్ వేదికగా  స్మితా సబర్వాల్ చేసిన రీ పోస్టుకు గానూ పోలీసులు నోటీసులు అందించారు. 

Also read:   ట్రీట్మెంట్ చేయడానికి వచ్చి ఇదేం పనిరా.. మహిళకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దారుణం

Advertisment
Advertisment
Advertisment