Telangana : అగ్రరాజ్యంలో తెలంగాణ యువకుడు మృతి! సికింద్రాబాద్ లోని తిరుమలగిరికి చెందిన రిటైర్డ్ ఆర్టీవో తులసీరాజన్ పెద్ద కుమారుడు బండా రుత్విక్ రాజన్ (30 ) రెండు సంవత్సరాల క్రితం ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లాడు. గురువారం రుత్విక్ బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందాడు. By Bhavana 26 Feb 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి America : విదేశాల్లో మంచి చదువు చదివి.. దానికి తగిన ఉద్యోగం పొంది.. కుటుంబానికి అండగా నిలవాలనుకున్నాడు. కానీ ఆ కలలు అన్నీ కల్లలుగానే మిగిలిపోయాయి. మృత్యువు అతనిని బ్రెయిన్ స్ట్రోక్(Brain Stroke) రూపంలో వెంటాడింది. స్నేహితులతో కలిసి ఆనందంగా భోజనం చేస్తున్న అతను ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వారంతా విషాదంలో మునిగిపోయారు. తెలంగాణ(Telangana) సికింద్రాబాద్(Secunderabad) లోని తిరుమలగిరికి చెందిన రిటైర్డ్ ఆర్టీవో తులసీరాజన్ పెద్ద కుమారుడు బండా రుత్విక్ రాజన్(Banda Ruthvik Rajan) (30) రెండు సంవత్సరాల క్రితం ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా(America) వెళ్లాడు. టెక్సాస్ యూనివర్సిటీ(Texas University) లో ఇటీవల ఎంఎస్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్నాడు. అమెరికాలో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. గురువారం రుత్విక్ స్నేహితులతో కలిసి భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో స్నేహితులు అతనిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రుత్విక్ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా చనిపోయినట్లు వివరించారు. దీంతో ఈ విషయాన్ని రుత్విక్ ఫ్రెండ్స్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. బంగారు భవిష్యత్‌ని ఊహించుకుని విదేశాలకు వెళ్లిన కుమారుడు విగతజీవిగా మారి రావడంతో వారు కంటికి మింటికి ఏకధాటిగా ఏడుస్తున్నారు. ఆదివారం రాత్రి రుత్విక్ మృతదేహం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ నుంచి కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ కు తరలించారు. రుత్విక్ మృతదేహాన్ని చూసి రుత్విక్ తల్లిదండ్రులు గుండెలు విలసేలా విలపిస్తున్నారు. Also Read : కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి #hyderabad #america #brain-stroke #telangana-student మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి