TS to TG : టీఎస్‌ ..టీజీ అయ్యింది..మరీ పాత వాళ్లు నెంబర్‌ ప్లేట్లు మార్చాలా?

టీఎస్‌ను టీజీగా మారుస్తూ రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ జీవో వచ్చిన తరువాత నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్‌ అయ్యే వాహనాలకు మాత్రమే TG నెంబర్ ప్లేట్లను కేటాయిస్తారని సమాచారం.

New Update
TS to TG : టీఎస్‌ ..టీజీ అయ్యింది..మరీ పాత వాళ్లు నెంబర్‌ ప్లేట్లు మార్చాలా?

Telangana Vehicle Registration Plate TG: తెలంగాణలో కాంగ్రెస్‌ (Congress)  లోకి అధికారంలోకి వచ్చిన పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. సీఎం రేవంత్ (CM Revanth Reddy) తన మార్క్‌ పాలన కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు సాధారణంగానే ఆ రాష్ట్రంలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడం వాటి విధానాలు, పాలనా శైలి మారిపోతుంటుంది.

ఇది కాంగ్రెస్‌ హయాంలో చాలా క్లియర్‌ గా కనిపిస్తుంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ప్రగతి భవన్‌ (Pragathi Bhavan) కాస్తా...ప్రజా భవన్‌(Praja Bhavan) గా మార్చేశారు. తాజాగా తెలంగాణ రాష్ట్రాన్ని సైతం టీఎస్‌ నుంచి టీజీగా (TS to TG) మారుస్తూ కేబినేట్‌ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

రాష్ట్ర చిహ్నాన్ని కూడా మార్చాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పేరు మార్పుతో ప్రజల్లో తమ వాహనాల నెంబర్ ప్లేట్ల మార్పు విషయంలో పెద్ద సందేహం వచ్చి పడింది. వివరాల్లోకి వెళ్తే.. టీఎస్‌ ను టీజీగా మారుస్తూ రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు వాహనాలన్నిటికి టీఎస్‌ అని ఉన్న నెంబర్‌ ప్లేట్లను టీజీగా మార్చుకోవాలా అనే దాని మీద పెద్ద సందేహం వ్యక్తం అవుతుంది.

ప్రస్తుతం దీని పై చర్చ నడుస్తుంది. అయితే ఇప్పటి వరకు టీఎస్‌ (TS) నంబర్‌ ప్లేట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదని , ప్రభుత్వ జీవో వచ్చిన తరువాత అప్పటి నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్‌ (New Registrations) అయ్యే వాహనాలకు మాత్రమే టీజీ (TG) నెంబర్ ప్లేట్లను కేటాయిస్తారని సమాచారం. గతంలో టీఎస్‌ పేరు మీద ఉన్న నంబర్‌ ప్లేట్లను మార్చాల్సిన అవసరం లేదని..అవి యధావిధిగా కొనసాగుతాయని సమాచారం.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత వాహనాలన్నింటికీ ఏపీ స్థానంలో టీఎస్‌ అని మార్చారు. ఇప్పుడు కొత్తగా టీజీ వచ్చి చేరుతుందని అధికారులు అంటున్నారు. పాత వాహనాలకు టీఎస్‌ ఉన్న స్థానంలో టీజీగా మార్చాలి అంటే మాత్రం అధికారులకు పెద్ద తలనొప్పి అనే చెప్పాలి.

ఎందుకంటే కొన్ని లక్షల వాహనాలు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి అలాంటి ప్రకటన ఏది రాలేదు కాబట్టి కొంచెం బెటర్‌. ఏదైనా విషయం ఉంటే అధికారులు అధికారికంగా ప్రకటిస్తారని ..అప్పటి వరకు వాహనదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.

Also Read: నా వెనుక గోతులు తవ్వి..నా ప్రత్యర్థులతో చేతులు కలిపారు!

Advertisment
Advertisment
తాజా కథనాలు