SangaReddy Tanks : భూమిపై నీటిపై దూసుకెళ్లే ట్యాంకులు.. మల్కాపూర్ చెరువులో పరీక్షలు!

తెలంగాణ- సంగారెడ్డిలోని కొండాపూర్ మండలం మల్కాపూర్ చెరువులో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అధికారులు యుద్ధ ట్యాంక్‌లను పరీక్షించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2,500 ట్యాంకులు తయారయ్యాయని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ జనరల్‌ మేనేజర్‌ రత్న ప్రసాద్‌ చెప్పారు.

New Update
SangaReddy Tanks : భూమిపై నీటిపై దూసుకెళ్లే ట్యాంకులు.. మల్కాపూర్ చెరువులో పరీక్షలు!

Malkapur Cheruvu : యుద్ధ అస్త్రాలను పెంచుకోవడంలో భారత్‌ దూసుకెళ్తోంది. ప్రత్యర్థిలను మనవైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా చేస్తోంది. సరిహద్దుల్లో పాక్‌తో పాటు చైనా నుంచి కవ్వింపు చర్యలు ఎదురవుతుండడంతో ఎప్పటికప్పుడు అలెర్ట్ అవుతోంది. ఈ క్రమంలోనే దేశంలోని పలుచోట్ల వార్‌ వెపన్స్‌తో పరీక్షలు నిర్వహిస్తోంది. తెలంగాణ- సంగారెడ్డిలోని కొండాపూర్ మండలం మల్కాపూర్ చెరువులో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ(Ordnance Factory) అధికారులు యుద్ధ ట్యాంక్‌లను పరీక్షించారు. భూమిపైనే కాకుండా నీటిపై కూడా నడిచే సామర్థ్యం ఉన్న రెండు ట్యాంకులను పరీక్షించారు.

మొత్తం 2,500 ట్యాంకులు:
ట్యాంకుల్లో లీకేజీలు ఉన్నాయా, అవి నీటిపై అవసరమైన వేగంతో వెళ్తున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ పరీక్ష నిర్వహించినట్టు ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ జనరల్‌ మేనేజర్‌ రత్న ప్రసాద్‌ చెప్పారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2,500 ట్యాంకులు తయారయ్యాయని తెలిపారు. ఈ పరిశ్రమలో బుల్లెట్ ప్రూఫ్ యుద్ధ ట్యాంక్ కూడా ఉందని, ఇది పది మంది సైనికులను కూడా తీసుకెళ్లగలదని చెప్పారు. అంతే కాకుండా, ట్యాంక్ బరువు 14 టన్నుల వరకు ఉంటుంది. గంటకు ఎనిమిది కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ ట్యాంకులను ఆర్మీ అవసరాలకు అనుగుణంగా తయారు చేస్తున్నారు. ఇక ఇదే సంస్థలో వీవీఐపీలు వినియోగించే బుల్లెట్ ప్రూఫ్ కార్లను కూడా తయారు చేయనున్నారు. నిజానికి ఈ ట్యాంకుల పరీక్లు ప్రతీఏడాది జరగుతాయి. మల్కాపూర్ చెరువులో వీటిని పరీక్షించడానికి ఒక కారణం ఉంది. ఆర్డినెన్స్‌ పరిశ్రమకు దగ్గరగా ఈ చెరువు ఉంటుంది. ఇతర చెరువులతో కంపేర్‌ చేస్తే ఎక్కువ లోతు కలిగి ఉంటుంది.

Also Read: ద్రవిడ్‎కు జిరాక్స్ కాపీనా ఏంటి..! మిస్టర్ డిపెండబుల్ కొడుకు వీడియో వైరల్

ఆర్మర్డ్ వెహికల్స్ కంపెనీ(Armored Vehicles) కి చెందిన కర్మాగారమే ఈ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ. జూలై 19, 1984న నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఈ ఫ్యాక్టరీని స్థాపించారు. పదాతిదళ పోరాట వాహనాల స్వదేశీ ఉత్పత్తి కోసం దీన్ని స్థాపించినట్టు సమాచారం. దశాబ్దాలుగా, కంపెనీ తన ఉత్పత్తుల శ్రేణిని విస్తరించింది. ఉపరితలం నుంచి గాలికి క్షిపణి (SAM) లాంచర్లు, ఉపరితలం నుంచి ఉపరితల క్షిపణి లాంచర్లు, సాయుధ అంబులెన్స్‌లు, స్వీయ చోదక హోవిట్జర్‌లు, ఆర్మర్డ్ కార్లు, మానవరహిత గ్రౌండ్ వెహికల్స్ (UGVలు) ఆర్మర్డ్ లైట్ రికవరీ వాహనాలు, గని రక్షిత వాహనాలు, సాయుధ ఉభయచర డోజర్‌లు, సాయుధ రాడార్లు, నౌకాదళ ఆయుధాలు మొదలైనవి తయారు చేసింది.

Also Read: పక్షిలా ఎగురుతూ పట్టేశాడు.. ఫీల్డింగ్ లోనూ మెరిసిన సాయి సుదర్శన్

Advertisment
Advertisment
తాజా కథనాలు