/rtv/media/media_files/2025/03/07/Y4sthbHOwN8SBlWcQDr5.jpg)
Ponnam Prabhakar CM Revanth Reddy (File Photos)
వివిధ కార్యక్రమాలు, ప్రెస్ మీట్లలో సీఎం రేవంత్ పేరు మర్చిపోయిన ఘటనలు ఇటీవల తరచుగా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయారు. విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. వైరా ఎమ్మెల్యే రాందాస్ కూడా ఈ రోజే సీఎం రేవంత్ పేరును మర్చిపోయారు. ఓ సభలో ప్రసంగిస్తూ సీఎం శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అంటూ ఆయన తడబడ్డారు. దీంతో ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"గౌరవ ముఖ్యమంత్రి #KCR గారు..." అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ సంభోదించడమేంటి?#RevanthReddy ని ముఖ్యమంత్రిగా గుర్తించలేకపోతున్న కాంగ్రెస్ మంత్రులు..
— Natcharaju Venkata Subhash (@nvsubhash4bjp) March 7, 2025
నేతలకే గందరగోళం అయితే, ప్రజలకు ఏం సంకేతం? #CongressConfusion #TelanganaPolitics pic.twitter.com/z2piwg4zne
😂రేవంత్ రెడ్డి వరుస అవమానాలు🤣
— నరసింహా 🦁సోషల్ మీడియా BRS warangal East (@Narsing90577995) March 7, 2025
ముఖ్యమంత్రి పేరు మర్చిపోయిన సొంత పార్టీ వైరా ఎమ్మెల్యే #రాందాస్ నాయక్...!
ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు అంటూ తడబడిన ఎమ్మెల్యే #రాందాస్ నాయక్..!!! pic.twitter.com/0u9DNleFfo
బీఆర్ఎస్ అభిమానులతో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా టీం ఈ వీడియోలను విస్తృతంగా షేర్ చేస్తోంది. రేవంత్ రెడ్డికి ఘోర అవమానం అంటూ ట్రోల్ చేస్తోంది. ఇటీవల గచ్చిబౌలిలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్న ఓ అధికారిక కార్యక్రమంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
తెలంగాణ సీఎం అంటూ.. రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయారు యాంకర్. అల్లు అర్జున్ సైతం సీఎం రేవంత్ పేరును మర్చిపోయిన విమర్శల పాలైన విషయం తెలిసిందే. తెలుగు మహాసభల్లో యాంకర్ గా వ్యవహరించిన నటుడు బాలాదిత్య సైతం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయి విమర్శలు మూటగట్టుకున్నారు.