Telangana : త్వరలో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు..?

తెలంగాణ లో కొద్ది రోజుల క్రితమే పార్లమెంట్‌ ఎన్నికల సమయం ముగిసింది.జులై మొదటి వారంలో షెడ్యూల్, చివరి వారంలో పంచాయతీ ఎన్నికల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లు సమాచారం.

New Update
Telangana : త్వరలో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు..?

Local Body Polls : తెలంగాణ(Telangana) లో కొద్ది రోజుల క్రితమే పార్లమెంట్‌ ఎన్నికల(Parliament Elections) సమయం ముగిసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అతి త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తుంది. జూన్ మొదటి వారంలో వార్డుల విభజన.. రెండవ వారంలో రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మూడవ వారంలో సర్పంచ్ లకు రిజర్వేషన్ ప్రక్రియ.‌. జులై మొదటి వారంలో షెడ్యూల్, చివరి వారంలో ఎన్నికలకు(Elections) సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లు సమాచారం.

షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 2 లోపు ఎన్నికల నిర్వహణ జరగనుండగా… ఆగస్టు 10లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్..మధ్యాహ్నం1 గంట వరకు పోలింగ్.. 2 గంటల తరువాత కౌంటింగ్‌.. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12,814 గ్రామపంచాయతీలు, 88,682 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

Also read: ఏపీలో ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్ ప్రక్రియ వాయిదా!

Advertisment
Advertisment
తాజా కథనాలు