పోలవరం గేట్లన్నీ తెరిచే ఉంచాలి..ఏపీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ!

New Update
పోలవరం గేట్లన్నీ తెరిచే ఉంచాలి..ఏపీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ!

గత కొన్ని రోజులుగా తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. పోలవరం గేట్లన్నీ తెరిచే ఉంచి… వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పిపిఎ)ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్ సీ మురళీధర్ పీపీఎకు లేఖ రాశారు.

polavaram project authority for polavaram project gates issue

పోయిన ఏడాది జులైలో గోదావరికి వచ్చిన వరదల సమయంలో పోలవరం వద్ద నీటి ప్రవాహం సరిగ్గా లేకపోవడం వల్ల భద్రాచలంతో పాటు పరిసర ప్రాంతాల్లోని 28 వేల ఎకరాల సాగు భూమి వరద నీటిలో మునిగిపోయిందని ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేశారు. దీనివల్ల ప్రజలు పునరావాసంతోపాటు ఆస్తినష్టం వాటిల్లిందని, కోట్లాది రూపాయల నష్టం తలెత్తిందని లేఖలో పేర్కొంది.

దేశ అత్యున్నత స్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బ్యాక్ వాటర్ ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకునేదాకా.. వాటర్ ఇయర్లో గేట్లన్నీ తెరిచే ఉంచాలని లేఖలో రాష్ట్ర ప్రభుత్వం కోరింది. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లు వారి వారి భూభాగాల పై పోలవరం ప్రాజెక్టు వల్ల బ్యాక్‌ వాటర్‌ బ్యాక్‌ వాటర్‌ ప్రభావం, ముంపు ప్రభావం పై దాఖలైన పిటిషన్‌ లను విచారించిన సుప్రీం కోర్టు.. బాధిత రాష్ట్రాలు లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి చొరవ తీసుకోవాలని గత ఏడాది సెప్టెంబర్ 6న పీపీఏ, సీడబ్ల్యూసీని ఆదేశించిందని ఆయన పేర్కొన్నారు.

సుప్రీం కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకునేదాకా పోలవరంలో నీటిని నిలిపివేయరాదని కోరారు. వాటర్‌ ఇయర్‌లో పోలవరం 48 గేట్లు, రివర్ స్లూయిజ్‌లు తెరిచే ఉంచాలని పేర్కొన్నారు. వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదిలేయాలని కోరారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు