CV Anand: హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్.. భారీగా IPSల బదిలీలు

తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ ల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ను హైదరాబాద్ సీపీగా బదిలీ చేసింది. ప్రస్తుతం సీపీగా పని చేస్తున్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని విజలెన్స్&ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ చేసింది. ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ ను నియమించింది.

New Update
CV Anand: హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్.. భారీగా IPSల బదిలీలు

తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ ల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. ఏసీబీ డీజీగా పని చేస్తున్న సీవీ ఆనంద్ ను హైదరాబాద్ సీపీగా బదిలీ చేసింది. ప్రస్తుతం సీపీగా పని చేస్తున్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని విజలెన్స్&ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ చేసింది. ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ ను నియమించింది. ఎన్నికల ముందు వరకు సీవీ ఆనందర్ హైదరాబాద్ సీపీగా పని చేశారు. అయితే.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈసీ ఆయనను బాధ్యతల నుంచి తప్పించింది. అనంతరం అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఆయనను ఏసీబీ డీజీగా నియమించింది.

ఏసీబీలోనూ ఆయన తనదైన మార్క్ చూపించారు. ముఖ్యంగా పోలీస్ శాఖలో అవినీతి అనకొండలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. దీంతో.. అనేక మంది సీఐలు, ఎస్ఐలు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కారు. పోలీస్ శాఖలో మాత్రమే కాకుండా.. ఇతర శాఖల అధికారులు కూడా ఇటీవల ఏసీబీకి భారీగా చిక్కారు. సీవీ ఆనంద్ దెబ్బకు కొందరు పోలీసులు ఇటీవల గతంలో తాము తీసుకున్న లంచాలను కూడా తిరిగి వెనక్కి ఇచ్చారన్న వార్తలు కూడా వచ్చాయి.

ఈ తరుణంలో సీవీ ఆనంద్ ను బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. అయితే.. శాంతిభద్రతల సమస్యలు పెరిగిపోవడం.. ట్రాఫిక్ నియంత్రణ తదితర కారణాలతోనే హైదరాబాద్ సీపీని మార్చారన్న ప్రచారం ప్రభుత్వం వర్గాల్లో సాగుతోంది. ఈ నేపథ్యంలోనే గతంలో సైబరాబాద్,  హైదరాబాద్ సీపీగా పని చేసిన అనుభవం ఉన్న సీవీ ఆనంద్ కు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. ఇంకా.. మరో ఐపీఎస్ అధికారి మహేశ్ భగవత్ ను పోలీస్‌ పర్సనల్‌ అదనపు డీజీగా, పోలీస్‌ స్పోర్ట్స్‌ ఐజీగా ఎం.రమేశ్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
publive-image

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: ఎంత ధైర్యం.. ప్రభాస్‌ను ఏంటి భయ్యా అఘోరీ ఇలా అనేసింది- దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్!

నాకు ప్రభాస్ అంటే ఇష్టం. ఆయన్ను డైరెక్ట్‌గా చూసే రోజు ఎప్పుడొస్తుందో? కలిస్తే ఒక్క సెల్ఫీ అడుగుతాను అని వర్షిణి తెలిపింది. వెంటనే అఘోరీ ఏంటీ ప్రభాస్ గోల ఆపు అనేసింది. అది కాస్త ప్రభాస్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. దీంతో అఘోరీని ట్రోల్ చేస్తున్నారు.

New Update

అందరూ ఊహించినట్లుగానే లేడీ అఘోరీ-శ్రీవర్షిణీ మ్యారేజ్ చేసుకున్నారు. అదీ ఒకసారి కాదు ఏకంగా రెండు సార్లు వివాహం చేసుకున్నారు. మొదటి సారి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్‌లో బ్రహ్మముహుర్తాన తెల్లవారిజామున 4 గంటలకు వర్షిణీ మెడలో అఘోరీ తాళి కట్టింది. రెండోసారి వర్షిణీ ఇంట్లో ఫ్యామిలీ సమక్షంలోనే బంగారం చైన్‌ను మెడలో వేసి మ్యారేజ్ చేసుకుంది. ఇది గడిచి చాలా రోజులే అయింది. కానీ ఇప్పుడే ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

ప్రభాస్ అంటే ఇష్టం

వర్షిణీ మళ్లీ అఘోరీ చెంతకు చేరుకుంది. అక్కడ నుంచి RTVతో లైవ్ లో మాట్లాడిన అఘోరీ-శ్రీవర్షిణీ.. తమ ఇష్యూలోకి ప్రభాస్‌ను లాగారు. ప్రభాస్ లాంటి అబ్బాయిని పెళ్లిచేసుకోవాలనిపించలేదా? అనే ప్రశ్నకు వర్షిణీ మాట్లాడుతూ.. ‘‘ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రభాస్ లాంటి అబ్బాయి ఉండడని అనుకున్నాను. కేవలం హీరోస్‌లోనే ఇష్టం.. రియల్ లైఫ్‌లో కాదు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

ప్రభాస్‌ను డైరెక్ట్‌గా ఎప్పుడూ చూడలేదు. ఆయన్ను డైరెక్ట్‌గా చూసే రోజు ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నాను. ప్రభాస్‌ను ఫస్ట్ టైం షూటింగ్ లో కానీ ఎక్కడైనా కలిస్తే ఆయన దగ్గరకి వెళ్లి.. హాయ్ సర్ ఐయామ్ బిగ్ ఫ్యాన్‌ ఆఫ్ యు డార్లింగ్ అని చెప్తాను. అంతేకాకుండా ఒక సెల్ఫీ కూడా అడుగుతాను. అఘోరీని కూడా డార్లింగ్ అని పిలిస్తాను’’ అని అఘోరీని డార్లింగ్ అని పిలిచింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

అయితే వర్షిణీ ప్రభాస్ గురించి మాట్లాడుతుండగా.. సరిగ్గా అప్పుడే అఘోరీ వచ్చి ఏంటీ ప్రభాస్ గోల అని లైవ్‌లో అనేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు చిర్రెత్తిపోయింది. ఒక్కసారిగా వారు షాక్ అయిపోయారు. తమ అభిమాన హీరో గురించి అఘోరీ అలా అనడం ఏంటని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. 

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

(aghori | sri varshini | aghori sri varshini | Aghori Sri Varshini Lov | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment