Telangana : అమిత్ షా వీడియో మార్పింగ్ కేసుపై హైకోర్టు స్టే.. అమిత్ షా వీడియో మార్పింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఇప్పటికే ఈ కేసులు ఐదుగురిని పోలీసులు కోర్టులో హాజరుపర్చగా.. ఆ తర్వాత వీళ్లకు బెయిల్ మంజూరయ్యింది. తదుపరి విచారణ చేయొద్దని కోర్టు పోలీసులకు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. By B Aravind 03 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Video Morphing Case : అమిత్ షా(Amit Shah) వీడియో మార్పింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) స్టే విధించింది. ఇప్పటికే ఈ కేసులు ఐదుగురిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత వీళ్లకు బెయిల్ మంజూరు అయ్యింది. ఈ కేసులో తదుపరి విచారణ చేయొద్దని పోలీసులకు కోర్టు ఆదేశించింది. ఇక తదువరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఇటీవల అమిత్ షా రిజర్వేషన్లపై మాట్లాడిన ఫేక్ వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్ పోలీసులు.. కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్‌కు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. Also read: తెలంగాణలో ఎంపీ ఎన్నికలపై సంచలన స్టడీ.. ఏ సీటులో ఎవరు గెలుస్తారంటే? ఇదిలా ఉండగా ఇటీవల తెలంగాణలు వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా.. ఓ సభలో మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న ముస్లీం రిజర్వేషన్లను తొలగిస్తామని అన్నారు. కానీ కొందరు అమిత్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లుగా ఎడిట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కేంద్ర హోం శాఖ ఆదేశాలతో ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా హైదరాబాద్ వచ్చిన ఢిల్లీ పోలీసులు(Delhi Police) గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీకి నోటీసులు ఇచ్చారు. అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. అనంతరం సీఎం రేవంత్ తరఫున లాయర్.. ఢిల్లీ పోలీసులకు వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఈ కేసుపై విచారణ జరగగా.. తాజాగా ఈ కేసును తదుపరి విచారణ చేయొద్దని న్యాయస్థానం పోలీసులకు ఆదేశించింది. Also Read: రోహిత్ వేముల సూసైడ్ కేసుపై పోలీసుల సంచలన రిపోర్టు.. #telugu-news #amit-shah #amit-shah-fake-video #video-morphing-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి