Navdeep: నవదీప్ కు షాకిచ్చిన హైకోర్టు మాదాపూర్ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. అతను హైకోర్ట్ లో దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరించింది. అంతేకాదు 41ఏ కింద నవదీప్ కు నోటీసులివ్వాలని పోలీసులను ఆదేశించింది. By Manogna alamuru 20 Sep 2023 in సినిమా క్రైం New Update షేర్ చేయండి Navdeep: డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్న నటుడు నవదీప్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దాని మీద ఈరోజు విచారణ జరిగింది. ఆయన వేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. నవదీప్ మీద ఇంతకు ముందు కూడా డ్రగ్స్ కేసులు ఉన్నాయని కోర్టుకు పోలీసులు వివరించారు. కానీ గతంలో డ్రగ్స్ కేసుల్లో నవదీప్ నిందితుడిగా లేడని అతని తరుఫు న్యాయవాది సిద్ధార్ధ్ వాదించారు. ఇంతకు ముందు దర్యాప్తు సంస్థల ముందు కూడా హాజరయ్యారని కోర్టుకు వివరించారు. ఇరువర్గాల వాదనలను విన్న కోర్టు నవదీప్ వేసిన పిటిషన్ ను కొట్టేసింది. అతనికి 41A కింద నోటీసులు ఇవ్వాలని నార్కోటిక్ పోలీసులకు ఆదేశాలను జారీ చేసింది. అలాగే విచారణ కోసం నవదీప్ కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది. కాగా, మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ను పోలీసులు ఏ29గా పేర్కొన్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ను 29వ నిందితుడిగా పోలీసులు చేర్చారు. మాదాపూర్ ప్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో హీరో నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను నవదీప్ తోసిపుచ్చుతున్నారు. డ్రగ్స్ కేసు ఎప్పుడూ తెరమీదికి వచ్చినా తన పేరును చేర్చుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. హీరో నవదీప్ పరారీలో ఉన్నట్టుగా స్యయంగా హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. అయితే తాను ఎక్కడికి పారిపోలేదని హీరో నవదీప్ ప్రకటించారు. వెంటనే ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 19వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ గడువు తీరడంతో నిన్న నవదీప్ నివాసంలో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో మరో పిటిషన్ ను దాఖలు చేశారు హీరో నవదీప్. ఈ పిటిషన్ ను విచారణను ఇవాళ ముగించింది హైకోర్టు. నోటీసులిచ్చి నవదీప్ ను విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. Also Read: పెళ్లి చేసుకోబోతున్న త్రిష..? వరుడు ఎవరో తెలుసా..!! #high-court #petition #drugs-case #hero-navdeep #navdeep మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి