Group-4: గ్రూప్‌ -4 మెరిట్‌ అభ్యర్థుల జాబితా విడుదల

తెలంగాణలో 8180 గ్రూప్‌ -4 సర్వీసుల పోస్టులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల మెరిట్‌ జాబితా విడుదలైంది.1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేసింది టీజీపీఎస్సీ. జూన్ 13 నుంచి వెబ్‌ఆప్షన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

New Update
Group-4: గ్రూప్‌ -4 మెరిట్‌ అభ్యర్థుల జాబితా విడుదల

TSPSC Group 4 Merit List: తెలంగాణలో 8180 గ్రూప్‌ -4 సర్వీసుల పోస్టులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల మెరిట్‌ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేసింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రెండు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కమిషన్ తెలిపింది. నాంపల్లి కమిషన్‌ కార్యాలయం అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పరిశీలన కొనసాగుతుందని పేర్కొంది.

Also Read: సామాన్య కార్యకర్త నుంచి కేంద్రమంత్రి స్థాయికి.. బండి సంజయ్ ప్రస్థానమిదే!

ఇక సర్టిఫికేట్ వెరికేషన్‌ కోసం రోజువారీ షెడ్యూల్‌ను త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి చెక్‌లిస్టు, అటెస్టేషన్ ఫారాలు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని.. అలాగే కావాల్సిన డాక్యుమెంట్లు అన్ని సిద్ధంగా ఉంచుకోవాలని సూచనలు చేశారు. అభ్యర్థులకు ఖాళీల వారిగా వెబ్‌ఆప్షన్లు ఇవ్వడానికి జూన్ 13 నుంచి వెబ్‌ఆప్షన్ల లింకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. వెబ్‌ ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను మాత్రమే పరిశీలించేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.

Merit List: https://cdn.thepublive.com/rtv/media/pdf_files/e8af9f875db9971409c3dbb7d1d1ff976208ddd06d51ebf946999e49b8b99518.pdf

Advertisment
Advertisment
తాజా కథనాలు