TSPSC Group-2 : తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్ పై గందరగోళం.. వాయిదా వేయక తప్పదా?

తెలంగాణలో గ్రూప్స్ ఎగ్జామ్స్ పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడిన గ్రూప్ 2 ఎగ్జామ్స్ జనవరి 6,7 తేదిల్లో జరగాల్సివుంది. కానీ ఇప్పటికి ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ బోర్డ్ నుంచిఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

New Update
GROUP-1: గ్రూప్-1 కు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు

Group - 2 Exams : తెలంగాణలో గ్రూప్స్ ఎగ్జామ్స్ పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే జరిగిన గ్రూప్ 4 పరీక్ష ఫలితాలు ఇంకా వెల్లడించకపోగా.. జరగాల్సిన గ్రూప్ 2, 3 ఎగ్జామ్స్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మొదట గ్రూప్ 2 పరీక్షలు 2023 ఆగస్టులో జరగాల్సి ఉండగా వివిధ కారణాలతో నవంబరుకు రిషెడ్యూల్ చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో మరోసారి జనవరికి వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ ఉత్వర్వ్యూలు జారీ చేసింది. అయితే ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు వాయిదా పడగా.. ఇచ్చిన జనవరి గడువు కూడా దగ్గరపడుతుంది. దీంతో ఈ పరీక్షల నిర్వహణపై టీఎస్‌పీఎస్సీ  కమిషన్‌ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో నిరుద్యోగుల్లో టెన్సన్ మొదలైంది.

ఈ మేరకు గ్రూప్‌-2(Group-2) లో 783 పోస్టుల భర్తీకిగానూ టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 29, 30 తేదీలలో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్‌ షెడ్యూల్‌ జారీచేసింది. అయితే అదే సమయంలో మిగతా పరీక్షలు ఉండటంతో అభ్యర్థులు పోస్ట్ పోన్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. దీంతో నవంబరు 2, 3 తేదీలకు పరీక్షను పోస్ట్ పోన్ చేశారు. ఇంతలోనే తెలంగాణలో నవంబరు 3 నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలుకావడంతో కమిషన్‌ ఈ పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్‌ చేసింది.

ఇది కూడా చదవండి : కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం.. 81మంది అమ్మాయిలు సస్పెండ్!

అయితే రాష్ట్రంలో పేపర్ లీకేజీ వ్యవహారం దుమారం రేపగా.. అభ్యర్థులు నిరసనలు చేపట్టారు. టీఎస్‌పీఎస్సీ బోర్డ్ రద్దు చేసి కొత్త వారిని నియమించాలని డిమాండ్ చేశారు. ఇంతలోనే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుసార్లు టీఎస్‌పీఎస్సీ  బోర్డ్ అధ్యక్షులు జనార్ధన్ రెడ్డిని తప్పించి కొత్త వారిని నియమించి నియామకాలు చేపడతామని తెలిపారు. అంతేకాదు టీఎస్‌పీఎస్సీ  ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించగా ఇందుకోసం యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల కమిషన్ల గురించి అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆదేశించారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహణపై ఇప్పటికే సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్ధన్  రాజీనామా చేస్తూ గవర్నర్ కు లేఖ రాశారు. అయితే గవర్నర్ ఆయన రాజీనామాను అంగీకరించలేదు. పేపర్ లీకేజీల వ్యవహారం మొత్తం బయటకొచ్చేదాకా జనార్ధన్ రాజీనామా కుదరదని గవర్నర్ తమిళసై స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారంపై ఎలాంటి క్లారిటీ రాకపోవడం, జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు రీషెడ్యూల్‌ చేస్తారా లేదా నిర్వహిస్తారా? లేదా అనే విషయమై టీఎస్‌పీఎస్సీ నుంచి స్పష్టత రాలేదు. దీంతో దరఖాస్తు చేసిన లక్షల మంది ఉద్యోగార్థులు కలవరపడుతున్నారు.

ఇదిలావుంటే.. జరగబోయే పరీక్షలతోపాటు నిర్వహించిన పరీక్షల ఫలితాలు వెల్లడించాలంటే టీఎస్‌పీఎస్సీ(TSPSC) కి కొత్త బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. బోర్డ్ సభ్యులందరూ రాజీనామా చేయగా.. మిగిలిన కోట్ల అరుణకుమారి, సుమిత్రా ఆనంద్‌ తనోబాలో ఒకరు యాక్టింగ్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించి పరీక్షలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ముందు ఛైర్మన్‌, ముగ్గురు సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందాలి. లేకుంటే ప్రభుత్వం కొత్తబోర్డును ఏర్పాటుచేస్తే, ఆ బోర్డు నిర్ణయం మేరకు పరీక్షలను రీషెడ్యూల్‌ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. కొత్త బోర్డు ఏర్పాటుకు ఛైర్మన్‌తో పాటు ఎంతమంది సభ్యులు ఉండాలన్న విషయమై ఇప్పటికే ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీని సంప్రదించింది. టీఎస్‌పీఎస్సీ బోర్డులో ఛైర్మన్‌తో పాటు 11 మంది సభ్యులను నియమించే వీలుండగా.. ఛైర్మన్‌తో పాటు సభ్యులకు ఉండాల్సిన విద్యార్హతలు, అనుభవ వివరాలను కమిషన్‌ వెల్లడించింది. మొత్తంగా కొత్తబోర్డు ఏర్పడిన తర్వాతే ఈ వ్యవహారం ముందుకు వెళ్లే ఛాన్స్ ఉండగా.. వచ్చే నెలలో ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశమే కనిపించట్లేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు