CM Revanth: రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. లోక్ సభకు ముందే ఫ్రీ కరెంట్, రుణమాఫీ?

త్వరలోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, ఫ్రీ కరెంటు స్కీమ్ ను అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది. లోక్ సభ ఎన్నికల్లోపే వీటిని అమల్లోకి తేవాలని భావిస్తోంది.

New Update
CM Revanth Reddy: సీఎం రేవంత్‌కు తప్పిన ప్రమాదం!

Runa Mafi : తెలంగాణ(Telangana) లో కొలువుదీరిన రేవంత్(Revanth) సర్కార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కసరత్తు చేస్తోంది. మరి కొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆరు గ్యారెంటీల్లో ఇచ్చిన హామీలను ప్రజలు వద్దకు చేరవేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన రెండో రోజు నుంచే అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అలాగే ఆరోగ్య శ్రీ కార్డు పరిమితి రూ.10లక్షల నుంచి రూ.15 లకు పెంచిన విషయం తెలిసిందే.

ఉచిత కరెంట్...

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలా సమయం లో ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) గృహ జ్యోతి పథకం కింద ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని.. ఎవరు కరెంట్ బిల్లులు కట్టకండి.. కాంగ్రెస్ పార్టే అధికారంలోకి రాబోతుందని కాంగ్రెస్ నాయకులు తెగ ప్రచారాలు చేశారు. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ ఫ్రీ కరెంట్ అంశం తెరపైకి వచ్చింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా కరెంట్ అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో 24 గంటల కరెంట్, ఇంటింటికి ఫ్రీ కరెంట్ వంటి పలు అంశాలపై అధికారులతో సీఎం రేవంత్ చర్చించారు. త్వరలో కొత్త విద్యుత్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు.. దీనిపై అధికారులు సమీక్ష చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల ముందే దీన్ని అమల్లోకి తేవాలని రేవంత్ సర్కార్ యోచనలో ఉన్నట్లు సమాచారం.

Also Read : వాటిని మాకు మంజూరు చేయండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్‌ వినతి..

రుణమాఫీ...

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసే ప్రక్రియ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) గా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhara Reddy) అద్వర్యం కాంగ్రెస్ పార్టీ ఒకే దఫాలో రైతులకు రుణమాఫీ చేసింది. తాజాగా వైఎస్సార్ అడుగుల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రైతుల రుణాలను ఒకే దఫాలో మాఫీ చేసేందుకు రేవంత్ సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. లేదంటే రెండు దఫాల్లో పూర్తి చేయనుంది.

రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్‌..

తెలంగాణలోని రైతులు బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకున్న క్రాప్ లోన్ల(Crop Loans) వల్ల వారిపై వడ్డీ భారం పడకుండా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం కోసం రేవంత్ సర్కార్ ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా చెల్లించేలా ప్లాన్‌ లో ఉన్నట్లు సమాచారం. తర్వాత బ్యాంకులకు విడతలవారీగా ప్రభుత్వం కట్టనుంది. ఇందుకోసం SLBC, ఇతర ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది సర్కార్.

Advertisment
Advertisment
తాజా కథనాలు