RYTHU BANDHU: రైతుబంధుపై సీలింగ్.. రేవంత్ సర్కార్ నిర్ణయం అదేనా?

రైతుబంధు స్కీమ్ పై సీలింగ్ పెట్టాలని తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని ఓ రిపోర్టర్ ప్రస్తావించగా.. సీఎం సానుకూలంగా స్పందించారు. బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

New Update
RYTHU BANDHU: రైతుబంధుపై సీలింగ్.. రేవంత్ సర్కార్ నిర్ణయం అదేనా?

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి ఆరు గ్యాంరెటీలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే.. ముఖ్యంగా ఇప్పటి వరకు రైతుబంధు (RYTHU BANDHU) స్కీమ్ కింద సాయం పొందిన వారు కూడా రైతుభరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రైతు బంధు కింద ఏడాదికి రూ.10 వేల సాయం అందిస్తుండగా.. రైతు భరోసా కింద రూ.15 వేలు అందించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే.. ఈ పథకం విషయంలో సీలింగ్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సాగు చేయని భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా రైతు బంధు అమలు చేశారన్న విమర్శ గత ప్రభుత్వంపై ఉంది.
ఇది కూడా చదవండి: T Congress: రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు షురూ!

ఇంకా.. ఎకరాల కొద్దీ భూములు ఉన్న వారికి కూడా పెట్టుబడి సాయం అందించి ప్రజాధనాన్ని వేస్టు చేస్తున్నారని కూడా గతంలో ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలో రైతుబంధు పథకంపై సీలింగ్ అంశం మరో సారి చర్చకు వచ్చింది. నిన్న సీఎం నిర్వహించిన ప్రెస్ మీట్లోనూ ఈ అంశం తెరమీదికి వచ్చింది. రైతుబంధుపై సీలింగ్ పెట్టాలని సీఎంను ఓ రిపోర్టర్ కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారు.

ఈ విషయాన్ని పరిశీలించాలని సీఎస్‌ను ఆదేశించారు. ఈ విషయంపై ప్రతిపక్షాలతో మాట్లాడి ఫైనల్ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు రేవంత్. అయితే.. ఐదు ఎకరాలు లేదా పది ఎకరాలను రైతుబంధు/రైతు భరోసా ఈ నేపథ్యంలో రైతుబంధు పథకంపై లిమిట్ ఎంత పెట్టబోతున్నారు? భూస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులకు రైతుబంధు కట్ చేస్తారా? అన్న అంశంపై చర్చ సాగుతోంది. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లోగా ఈ అంశంపై పూర్తి క్లారిటీ రానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు