Sarpanch Elections: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. ఎప్పుడంటే?

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలపై ఇంకా క్లారిటీ రాలేదు. తమ పదవీకాలాన్ని పొడిగించాలని సర్పంచులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఎంపీ ఎన్నికల తరువాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సర్పంచుల పదవీకాలం FEB 1తో ముగియనుంది.

New Update
Sarpanch Elections: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. ఎప్పుడంటే?

Telangana Sarpanch Elections: తెలంగాణలో మరికొన్ని నెలల్లో మరోసారి ఎన్నికలు జరగనున్నాయి. అవును మీరు విన్నది నిజమే!, మరి కొన్ని నెలల్లో తెలంగాణలో మూడు ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, అలాగే పంచాయతీ ఎన్నికలు. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నెల 29న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLC) ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. పార్లమెంట్ ఎన్నికలపై ఇంకా నోటిఫికేషన్ రాలేదు. లోక్ సభ ఎన్నికలకు (Lok Sabha Elections) ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అన్ని పార్టీలు ఎంపీ ఎన్నికలపై కసరత్తు ప్రారంభించాయి.

ALSO READ: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

పంచాయితీ ఎన్నికలు..?

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఇంకా స్పష్టత రాలేదు. ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకుస్పందించలేదు. ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచ్, ఉపసర్పంచుల పదవీకాలం ముగుస్తుంది. వాస్తవానికి ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావాలి. షెడ్యూల్ రాకపోవడంతో ప్రత్యేక అధికారులకు భాద్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పంచాయతీ రాజ్ శాఖ జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

పదవి కాలం పొడిగించండి..

తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని (Congress Govt) సర్పంచులు రిక్వెస్ట్ చేస్తున్నారట. గత ప్రభుత్వం లో ఉన్న పెండింగ్ బిల్లులు ఇంకా రాలేదని.. అందుకోసం తమ పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతున్నారట. వారి అభ్యర్థనలు విన్న రేవంత్ (CM Revanth Reddy) సర్కార్ వారి పదవి కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎన్ని నెలలు పొడిగించాలనే దానిపై నేతలతో అంతర్గత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల తరువాతే పంచాయతీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి లేదా మార్చిలో లోక్ సభ షెడ్యూల్ విడుదల కానుంది. తెలంగాణలో ఒకేసారి జడ్పిటీసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: Rythu Bandhu : రైతులకు గుడ్ న్యూస్.. రైతు బంధుకు లైన్ క్లియర్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CSK Vs SRH: చెన్నైతో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఇవాళ సీఎస్కే vs ఎస్‌ఆర్‌హెచ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే టాస్‌ గెలిచిన SRH జట్టు.. బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో CSKజట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ రెండు జట్లు పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

New Update
CSK Vs SRH

CSK Vs SRH Photograph: (CSK Vs SRH)

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఇవాళ సీఎస్కే vs ఎస్‌ఆర్‌హెచ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే టాస్‌ గెలిచిన SRH జట్టు.. బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో CSK జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. రెండు జట్లు పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాయి. వరుసగా పరాభవాలతో రెండు జట్లలోనూ ఆత్మవిశ్వాసం లోపించింది. ఆరేసి ఓటములు, రెండేసి విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి. 

ధోనీ 400వ టీ20 మ్యాచ్‌

ఇదిలా ఉంటే సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇది 400వ టీ20 మ్యాచ్‌. అతడు తన కెరీర్‌లో 400వ టీ20 మ్యాచ్‌‌ను SRHతో ఆడనున్నాడు. దీంతో భారత్‌ నుంచి నాలుగో ప్లేయర్‌గా ధోనీ నిలిచాడు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 24వ ఆటగాడిగా ఉన్నాడు. ధోనీ కంటే ముందు మరో ముగ్గురు ఉన్నారు. వారు.. రోహిత్ శర్మ 456 మ్యాచ్‌లు, దినేశ్‌ కార్తిక్ 412 మ్యాచ్‌లు, విరాట్ కోహ్లీ 408 మ్యాచ్‌లు ఆడారు. ఆ తర్వాత స్థానంలో ధోనీ ఈ ఘనత అందుకొన్నారు. ధోనీ ఇప్పటివరకు 399 మ్యాచులు ఆడాడు. అందులో మొత్తం 7,566 పరుగులు చేశాడు.

telugu-news | IPL 2025 | latest-telugu-news | CSK Vs SRH

Advertisment
Advertisment
Advertisment