Telangana: గృహజ్యోతిలో కొత్త రూల్స్..వారికి మాత్రమే పథకం వర్తింపు! గృహజ్యోతి పథకానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనను ఖరారు చేసింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం కరెంటు బిల్లు బకాయిలు ఉండకూడదు. ఒక రేషన్ కార్డుపై ఒక సర్వీసు. ఒకటికి మించి విద్యుత్తు మీటర్లు ఉండకూడదు. అద్దెకుంటున్న వారికి రేషన్ కార్డు తప్పనిసరి చేయనుంది. By srinivas 09 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Gruha Jyoti: తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకానికి కొత్త నిబంధనను ఖరారు చేసింది. ఎన్నికల మెనిఫెస్లోలో గృహ జ్యోతి పథకానికి నిర్దిష్ట నియమాలు లేదా అర్హతను పేర్కొనలేదు. కానీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం ప్రజాపాలన అప్లికేషన్‌లో ప్రభుత్వం గృహ విద్యుత్ మీటర్ కనెక్షన్ నంబర్‌ను తీసుకుంది. దీని ఆధారంగానే నెలవారీ గృహ విద్యుత్ వినియోగం డేటాను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. గృహ జ్యోతి పథకం నియమాలు.. ఈ మేరకు తెలంగాణ ప్రజలు గత 2 నెలలుగా తమ కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం గృహజ్యోతి పథకానికి కొత్త నిబంధనను రూపొందించింది. దరఖాస్తుదారులు అడ్మినిస్ట్రేషన్ అప్లికేషన్‌ను సరిగ్గా పూరించాలి. కరెంటు బిల్లు బకాయిలు ఉండకూడదు. గతంలో పెండింగ్‌లో ఉన్న అన్ని విద్యుత్ బిల్లులను క్లియర్ చేసిన వారికి మాత్రమే అర్హత ఉంటుంది. విద్యుత్ బిల్లుల బకాయిలన్నీ ఈ నెలలోనే క్లియర్ చేయాలి. ఇవన్నీ గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను పొందేందుకు ఇవి తప్పనిసరి నిబంధనలు. పై షరతులను నెరవేర్చడంలో విఫలమైన వారు మీ ప్రజా పలానా దరఖాస్తు తర్వాత కూడా అర్హులు కారు. ఈ పథకానికి పూర్తిగా అనర్హులు కానున్నారు. ఇది కూడా చదవండి : Supreme Court: వెనుకబడిన వర్గాలపై రాష్ట్ర ప్రభుత్వాలు వివక్షచూపించకూడదు: సుప్రీంకోర్టు రేషన్ కార్డుపై ఒకే సర్వీసు.. అలాగే గత ఏడాది వాడిన యూనిట్లను సగటుగా తీసుకుని అర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఒక రేషన్ కార్డుపై ఒక సర్వీసుకు మాత్రమే పథకం వర్తించనుంది. ఒక యజమానికి రెండు ఇళ్లు ఉంటే అందులో ఒక దానికి మాత్రమే లబ్ది పొందనున్నారు. మన సర్వీసు నెంబర్‌కు ఆధార్, రేషన్ లింక్ తప్పనిసరి చేసుకోవాలి. ఒకటికి మించి విద్యుత్తు మీటర్లు ఉంటే.. ఏ సర్వీసుకు పథకం కావాలో ఎంచుకునే అవకాశం కల్పించింది. అద్దే ఇళ్లకు.. ఒకవేళ రేషన్ కార్డు ఉండి అద్దెకు ఉంటున్న విద్యుత్తు వినియోగదారులకు కూడా ఈ పథకం వర్తించనుంది.ఇందులో భాగంగానే ఇప్పటికే అద్దెదారుల సమాచారాన్ని విద్యుత్తు సిబ్బంది సేకరిస్తుంది. ఆరు గ్యారంటీల కోసం అప్లై చేసిన దరఖాస్తుదారులకు మెసేజ్‌లు పంపిస్తున్నారు. సిబ్బంది ద్వారా సమాచార ధృవీకరణ జరుగుతుందంటూ ఫోన్లకు సందేశాలిస్తూ.. ప్రజాపాలన దరఖాస్తు రశీదు, రేఫన్ కార్డు నెంబర్ ఆధార్ కార్డు నెంబర్ అందుబాటులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఏది ఏమైనా లోక్‌సభ ఎన్నికలలోపే గృహజ్యోతి అమలు చేసేలా ప్లాన్ చేస్తోంది రేవంత్ సర్కార్. #cm-revanth #telangana-government #new-rules #gruha-jyoti-scheme మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి