Telangana LRS: ఎల్ఆర్ఎస్ కు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. మార్గదర్శకాలివే!

లే అవుట్ల కమబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. మొత్తం మూడు దశల్లో అప్లికేషన్లను పరిశీలించి ఆమోదించాలని నిర్ణయించింది. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ ను వినియోగించనున్నారు.

New Update
Telangana LRS: ఎల్ఆర్ఎస్ కు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. మార్గదర్శకాలివే!

LRS Telangana: తెలంగాణలో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న లే అవుట్ల కమబద్ధీకరణ (LRS) అంశానికి కదలిక వచ్చింది. తాజాగా రేవంత్ సర్కార్ (Revanth Government) ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. కొన్ని నిబంధనలను సైతం సడలించింది. పెండింగ్ దరఖాస్తులను ఆమోదించడానికి అనుమతులు ఇచ్చింది. 2020లో నాటి బీఆర్ఎస్ (BRS) సర్కార్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇందుకు సంబంధించిన దరఖాస్తులను సైతం ఆహ్వానించారు. ఒక్కో అప్లికేషన్ కు రూ.1000 చొప్పున వసూలు చేసింది ప్రభుత్వం. దీంతో ఎల్ఆర్ఎస్ కోసం మొత్తం 25 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. కానీ.. కోర్టు కేసులు రావడంతో ఆ ప్రక్రియ అప్పుడు ఆగిపోయింది.

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ పై అనేక సార్లు కీలక ప్రకటనలు చేసింది. దరఖాస్తుదారులకు మేలు జరిగేలా సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు తాజాగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో లే అవుట్ల క్రమబద్ధీకరణకు అనుమతించింది. ఇందుకు సంబంధించి గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. దరఖాస్తులను మొత్తం మూడు దశల్లో వడపోసి ఆమోదించనున్నారు. సీజీజీ (సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌) రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్‌ ద్వారా ఈ ప్రాసెస్ నిర్వహించనున్నారు.

మొదటి దశ:
ప్రత్యేకంగా రూపొందించిన సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ అప్లికేషన్‌ ఆధారంగా మొదటిదశలో అప్లికేషన్లను పరిశీలిస్తారు. ప్రభుత్వ భూముల్లో చేసిన లే అవుట్లు, వివాదాస్పద భూముల్లో చేసిన లే అవుట్లకు సంబంధించిన పర్మిషన్లను ఈ దశలోనే ఆపేస్తారు. ధరణి పోర్టర్లో ఉన్న వివరాలు, సర్వే నంబర్ల ఆధారంగా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న వివరాలను ఇందుకోసం పరిశీలిస్తారు. లేఅవుట్‌ వేసిన భూమి సమగ్ర వివరాలను గుర్తించి.. రెవెన్యూ ఇన్స్‌పెక్టర్, నీటిపారుదల శాఖ ఏఈ, పంచాయతీ ఈవో తదితర అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలతో క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు. ఈ బృందం ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించినదా? కోర్టు వివాదాలు ఉన్నాయా? అన్న వివరాలను పరిశీలిస్తుంది. ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ లో ఈ వివరాలను నమోదు చేస్తారు.

రెండోదశలో..
ఫస్ట్ ఫేజ్ లో క్లీయర్ అయిన అప్లికేషన్లను ఈ దశలో పరిశీలిస్తారు. టౌన్ ప్లానింగ్, పంచాయతీ అధికారులు ఈ అప్లికేషన్లను పరిశీలిస్తారు. లేఅవుట్ వివరాలు, నిబంధనల ప్రకారం ఖాళీ స్థలం వదిలేశారా? రోడ్లను నిర్మించారా? తదితర టెక్నికల్ అంశాలను ఈ ఫేజ్ లో పరిశీలిస్తారు. అన్ని సరిగా ఉన్నాయని భావిస్తే.. ఆ దరఖాస్తుకు క్రమబద్ధీకరణ ఫీజును డిసైడ్ చేస్తారు. దరఖాస్తుదారులు ఫీజు చెల్లించిన మూడో ఫేజ్ కు అప్లికేషన్ ను ఫార్వర్డ్ చేస్తారు.

మూడోదశలో..
ఇది ఫైనల్ దశ. మొదటి రెండు దశలను దాటి వచ్చిన అప్లికేషన్లను ఈ ఫేజ్ లో పరిశీలిస్తారు. మున్సిపల్‌ కమిషనర్లు, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌ చైర్మన్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు ఈ దశలో అప్లికేషన్లను పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు. లోపాలు ఉంటే రిజెక్ట్ చేస్తారు. లేకుంటే అనుమతి కోసం సంబంధిత అధికారులకు పంపిస్తారు.

మూడు నెలల్లో..
ఈ నెల ఫస్ట్ వీక్ లోనే ఎల్ఆర్ఎస్ ప్రాసెస్ ను ప్రారంభించి మూడు నెలల్లో క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇందుకోసం అన్ని జిల్లాల కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లు, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు, పంచాయతీ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు చొరవ తీసుకోవాలని సూచించింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: ముమ్మాటికి భద్రతా లోపమే.. అమిత్ షా, మోదీ రాజీనామా చేయాలి.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!

ఉగ్రదాడి ముమ్మాటికి భద్రత లోపమేనని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. ఈ ఘటనకు అమిత్ షా, మోదీ బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఫైర్ అయ్యారు. ఇంత ఘోరంగా సెక్యూరిటీ విఫలం కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
 ys sharmila

ys sharmila

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి మనం దేశం మీద జరిగిన దాడి అని ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ షర్మిల అన్నారు. దేశంలో శాంతి భద్రతలు గొప్పగా ఉన్నాయని  ప్రధాని మోడీ ఒక క్యాంపెయిన్ నడిపారని.. పెద్ద పెద్ద బోర్డులు పెట్టారని అన్నారు. ఇది చూసి ఏటా 2 కోట్ల మంది కశ్మీర్ కి వెళ్తుంటారన్నారు. ఇలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ లోపం ఎందుకు? అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి భద్రత లోపమేనని ధ్వజమెత్తారు. టూరిస్టులపై కాల్పులు జరుపుతుంటే ఆర్మీ వాళ్లు లేనే లేరన్నారు. ప్రొటెక్షన్ కోసం ఉండే సెక్యూరిటీ కూడా లేదన్నారు. ఇంతమంది చనిపోయారు అంటే ప్రభుత్వ లోపమేనన్నారు. ఉగ్రవాదం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు. ఈ ఘటనకు అమిత్ షా, మోదీ బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ అని అన్నారు. నేడు దేశ నిఘా వ్యవస్థ దేశం కోసం పనిచేయడం లేదన్నారు. ఇండియా ఇంటలిజెన్స్ అంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ల మీద పనిచేస్తోందని ఆరోపించారు. 

మోదీకి అధికారంలో ఉండే హక్కు లేదు..

ఇంత ఘోరంగా సెక్యూరిటీ విఫలం కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్లకు అధికారంలో ఉండే హక్కు లేదన్నారు. వీళ్ళు దేశానికి చౌకిదార్ కాదు..బీజేపీకి చౌకిదార్లని అన్నారు. ఈ దేశ దర్యాప్తు వ్యవస్థలను సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్నారు. నిఘా వ్యవస్థ బలం అంతా ప్రధాని మోదీ కోసం పని చేస్తోందన్నారు. దేశ భద్రతను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికి కేంద్రం తప్పిదమేనని ఫైర్ అయ్యారు. ఈ ఘటనలో ఒక ముస్లిం కూడా చనిపోయారని.. దేశంలో ఉన్న ముస్లింలను చెడ్డవాళ్ళు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో మతం పేరుతో యుద్ధం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ దేశంలోనే ఇంటర్నల్‌గా భద్రత లేదన్నారు. అన్ని మతాలు సమానం అనే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రవాదులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు. మోదీ శ్రమ దేశ భద్రత కోసం పెట్టి ఉంటే బయట వాళ్ళు చొరబడే పరిస్థితి లేదన్నారు.

Advertisment
Advertisment
Advertisment