Telangana : తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా

తెలంగాణ గవర్నర్ తమిళ సై రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపిచారు. ఈసారి తమిళనాడు నుంచి ఆమె లోక్‌సభకు పోటీ చేసే అవకాశం ఉంది. ఈ కారణంగానే రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. 

New Update
Tamilisai : కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థి ఎవరో వాళ్లకే తెలియదు.. తమిళిసై విమర్శలు

Governor Tamilisai Resigned : లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ గవర్నర్(Telangana Governor) తమిళి సై సౌందర్‌రాజన్(Tamilisai Soundararajan) తన గవర్నర్ పదవికి రాజీనామా(Resigned) చేశారు. తమిళిసై తెలంగాణ గవర్నర్‌ పదవికి, అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) కు పంపించారు. ఈరోజు తమిళి సై హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తారని రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. దీని తరువాత తమిళ సై ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారని తెలుస్తోంది. ఆమెకు బీజేపీ నుంచి ఎంపీగా టికెట్ ఇవ్వనున్నారని...చెన్నై సెంట్రల్ నుంచి కానీ తూత్తుకుడి నుంచి గాని లోక్‌సభ కు పోటీ చేస్తారని సమాచారం.

ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవని తమిళి సై..

1999లో బీజేపీలో చేరిన తమిళిసై.. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర చెన్నై నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. 2006 నుంచి తమిళిసై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. ఇంత వరకూ ఒక్కసారి కూడా విజయాన్ని అందుకోలేకపోయారు. 2006 తమిళనాడు అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections) ల్లో మొదటిసారి రామనాథపురం నియోజకవర్గం నుంచి తమిళసై బరిలో దిగారు. కానీ విజయం సాధించలేకపోయారు. తర్వాత 2011 తమిళనాడు ఎన్నికల్లో వేళచ్చేరి నుంచి పోటీచేసి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి నేతృత్వంలో తూత్తుకుడి నుంచి పోటీ చేసి డీఎంకే అభ్యర్థి కనిమొళి చేతిలో ఓడిపోయారు. దీనిని తర్వాత కేంద్రంలోని బీజేపీ ఆమెను తెలంగాణా గవర్నర్‌గా పంపింది.తరువాత పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను కూడా అప్పగించింది.

మిళిసై తండ్రి కమరి ఆనంద్‌ తమిళనాడు కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. కానీ తమిళి సై మాత్రం బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై 1999లో ఆపార్టీలో చేరారు. తమిళనాట బీజేపీ బలోపేతం కావడంలో తమిళి సై పాత్ర ఉందని చెబుతారు. బీజేపీ(BJP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా, జాతీయ కార్యదర్శిగా ఆమె పలు పదవులను నిర్వహించారు.

Also Read : Delhi : ఎలక్టోరల్ బాండ్స్ పూర్తి వివరాలను వెల్లడించాలి-సుప్రీంకోర్టు

Advertisment
Advertisment
తాజా కథనాలు