Telangana: గడ్డం తీసేసే టైమొచ్చింది.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం అని అన్నారు ఆ పార్టీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి. తన మొక్కు నేటితో తీరిపోతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. తన గడ్డం తీసేసే సమయం వచ్చిందని పేర్కొన్నారు. By Shiva.K 02 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana: నా మొక్కు నేటితో తీరుతుంది.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. నా గడ్డం తీసేస్తానని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్.. క్యాంపు రాజకీయాల గురించి తనకు తెలియదన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్యాంపు రాజకీయం తప్పేమీ కాదన్నారు. సీఎం ఎవరన్నది అధిష్టానమమే నిర్ణయిస్తుందని, రేపు రిజల్ట్ తర్వాతే తాను ఈ అంశంపై మాట్లాడుతాన్నారు. ఎగ్జిట్ ఫలితాలు తమకు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నదని వ్యక్తిగతంగా తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఫలితాల వేళ బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోకూడదని.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా చూడాలని ఈసీని కోరామన్నారు. ఆదివారం గెలుపు ధ్రువపత్రాలను మా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు తీసుకుంటారని, ఈ మేరకు ఆర్వోలకు ఆదేశాలు ఇవ్వాలని సీఈవోను కోరామన్నారు. ఎల్లుండి కేసీఆర్ కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారని, ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదన్నారు. రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఉండొచ్చని చెప్పారు. Also Read: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుపాను ఎఫెక్ట్.. 142 ట్రైన్స్ రద్దు.. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, 144 సెక్షన్.. #telangana-news #telangana-elections-2023 #uttam-kumar-reddy #congress-party #nalgonda-news #telangana-election-updates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి