Telangana Elections: కాంగ్రెస్, బీజేపీపై మంత్రి కేటీఆర్ మాస్ సెటైర్లు.. సిరిసిల్ల రాజకీయలపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో మాట్లాడిన ఆయన.. తాను అభివృద్ధి చేయకపోతే తనకు ఓటు వేయొద్దని స్పష్టం చేశారు. ఎన్నికల వేళ ఎవరెవరో వచ్చి ఏదేదో చెబుతారని, ఆగం కావొద్దని ప్రజలను కోరారు. తాను చేసిన పని కళ్ల ముందు కనపడుతోందన్నారు. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఆగం చేసుకోవద్దని ప్రజలకు సూచించారు మంత్రి. By Shiva.K 27 Oct 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Minister KTR: ఎన్నికల వేళ విపక్ష పార్టీల నేతలు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారికి సోషల్ మీడియాలో సరైన సమాధానం చెప్పాలని బీఆర్ఎస్(BRS) శ్రేణులకు దిశానిర్దేశం చేశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Minister KTR). శుక్రవారం సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమ్మేళనానికి భారీ సంఖ్యలో యువకులు, బీఆర్ఎస్ యూత్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. గతంలో సిరిసిల్లకు.. ఇప్పటి సిరిసిల్లకు తేడాను సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సిరిసిల్ల ఒకప్పుడు ఉరిసిల్లగా ఉండేదని, ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలియజేయాలన్నారు. నాడు 'నేతన్న ఆత్మహత్య వద్దు' అనే రాతలు సిరిసిల్ల గోడలపై ఉండేవని.. నేడు ఆ పరిస్థితి లేదన్నారు. సిరిసిల్లలో భారీ స్థాయిలో విద్యాసంస్థలు వస్తాయని కలలో కూడా ఎవరూ అనుకోలేదన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు అందరూ సిరిసిల్ల, గజ్వేల్‌లోనే అభివృద్ధి అంటుంటే.. సిరిసిల్లలోని విపక్ష నాయకులు మాత్రం ఇక్కడ అభివృద్ధి ఏమీ లేదని అంటున్నారని విమర్శించారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ నాయకత్వం వల్లే నేడు మానేరు సజీవ ధారగా మారిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సిరిసిల్లలో వర్కర్ టూ ఓనర్ పథకాన్ని తీసుకువస్తున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్. సంక్షేమం, అభివృద్ధి అన్ని రంగాల్లో పురోభివృద్ధిని సాధిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. ఇదికూడా చదవండి:ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగితే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. కాంగ్రెస్, బీజేపీ వారికి మాత్రమే తెలంగాణ అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు మంత్రి కేటీఆర్. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్లు దండుకోవడానికి, కుల, మతాల పేరుతో ముందుకు వస్తారని విమర్శించారు. కులం, మతం కాదు.. గుణం చూసి ఓటు వేయాలని ప్రజలను కోరారు మంత్రి కేటీఆర్. అభివృద్ధే తన కులం.. సంక్షేమమే తన మతం అని అన్న. తాను పని చేస్తాను అనుకుంటేనే తనకు ఓటు వేయాలన్నారు కేటీఆర్. సిరిసిల్ల చరిత్రలోనే మొదటి సారిగా 2014లో నియోజకవర్గం ఎమ్మెల్యేకు మంత్రి పదవి వచ్చిందని.. తనకంటూ ఓ గుర్తింపు ఉందంటే దానికి కారణం సిరిసిల్ల ప్రజలే అని అన్నారు కేటీఆర్. '14 సంవత్సరాలుగా నా పనితీరు మీ ముందు ఉంది. నేను చేసిన పనులు మీ ముందు కనిపిస్తున్నాయి. మీ తలరాత రాసుకునేది మీరే, దాన్ని మంచిగా ఉపయోగించుకోండి. ఇంత కష్టపడి సాధించుకుని.. ఇప్పుడు నాశనం చేసుకోవడం సరికాదు.' అని అన్నారు మంత్రి కేటీఆర్. Live: బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ యువ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRBRS #KCROnceAgain #VoteForCar https://t.co/8iEytjpkQu — BRS Party (@BRSparty) October 27, 2023 ఇదే సమయంలో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పైనా తనదైన శైలిలో సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. 'ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి అవుతుండట! మెడ మీద తల ఉన్నోడు ఎవడైనా అతని చేతిలో రాష్ట్రాన్ని పెడతాడా? కాంగ్రెస్ దిక్కులేని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది తప్పా.. ఇష్టపూర్వకంగా ఇవ్వలేదు. 55 ఏళ్లలో ఏ పని చేయడం చేతకాలేదు కానీ.. ఇప్పుడు అదిలేదు, ఇదిలేదు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు.' అంటూ కాంగ్రెస్ నేతల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ఇక బీజేపీ నేతలపైనా పంచ్‌లు వేశారు మంత్రి కేటీఆర్. బీజేపీ నేతలకు ఏ వారం ఏ దేవుడు తప్పితే మరేం తెల్వదన్నారు. రు.60 డీజిల్ రు.100, 70 రూపాయల పెట్రోలు 110 రూపాయలు చేసినందుకు నరేంద్ర మోదీ దేవుడు అయ్యాడా? అని ప్రశ్నించారు కేటీఆర్. ఎలక్షన్ సమయంలో ఆగం కాకుండా.. ఆచితూచి అడుగులు వేయండని ప్రజలను కోరారు. విజన్ ఉన్న నాయకుడు ప్రతిపక్షంలో ఒక్కరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు కేటీఆర్. 'ఎన్నికల వేళ ఇంటింటికి వచ్చి ఇది చేస్తాం.. అది చేస్తాం అని అంటారు. మాకు ముఖ్యమంత్రి కేసీఆర్, అన్న రామన్న ఉన్నాడని చెప్పాలి' అని నియోజకవర్గ ప్రజలకు మంత్రి కేటీఆర్ సూచించారు. ఇదికూడా చదవండి: పదవి విరమణ తరువాత నెలవారీగా పెన్షన్ పొందాలనుకుంటున్నారా? ఈ పథకం బెస్ట్! #rajanna-sircilla #telangana-news #hyderabad #telangana-elections #minister-ktr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి