Etela Rajender: కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లే.. ఈటల సంచలన వ్యాఖ్యలు సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కాంగ్రెస్‌కు ఓటేస్తే BRSకు వేసినట్లే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేండ్లు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలను కేసీఆర్ గాలికి వదిలేశారని అన్నారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. By V.J Reddy 20 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికలకు ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. ప్రచారంలో భాగంగా ఈరోజు నగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించిన బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్( Etela Rajender). పర్యటనలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు ఈటల. ALSO READ: ఒకే విడతలో రూ.10లక్షలు.. సీఎం కేసీఆర్ సంచలన హామీ నగర్ కర్నూల్ లో పర్యటించిన ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఈసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పదేళ్లు కేసీఆర్ (KCR) అధికారంలో ఉండి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. ఈసారి కూడా ఏదోఒకటి చెప్పి మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లే అని ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు మళ్లీ అధికారమిస్తే ఫామ్ హౌస్, ప్రగతి భవన్‌కే పరిమితం అవుతారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్ అధికారులకు సైతం మాట్లాడే అవకాశం లేదని పేర్కొన్నారు. దళిత ముఖ్యమంత్రి, రేషన్ కార్డులు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. ALSO READ: కొట్టుకున్న BRS, కాంగ్రెస్ శ్రేణులు.. ఎక్కడంటే? #kcr #congress #telugu-latest-news #telangana-election-2023 #bjp-etela-rajender మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి