KTR vs Revanth: 'డ్రామారావు.. గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార'.. మొండి కత్తి డ్రామా!

బీఆర్‌ఎస్‌ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన కత్తి దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దాడి చేసింది కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తి అని.. ఓ నేరస్థుడిని టీపీసీసీ అధ్యక్షుడిగా చేశారంటూ కేటీఆర్‌ వేసిన ట్వీట్‌పై రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ఒక ఎంపీపై దాడి జరిగితే దానిని చిల్లర రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే మీ కచరా ప్రయత్నం చూస్తుంటే బీఆర్ఎస్ ఓటమి ఖాయం ఐనట్టేనంటూ మండిపడ్డారు.

New Update
KTR vs Revanth: 'డ్రామారావు.. గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార'.. మొండి కత్తి డ్రామా!

తెలంగాణలో ఎన్నికల వేడి పీక్స్‌కు చేరుకుంది. నేతల మధ్య మాటల యుద్ధం నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లింది. ముఖ్యంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బడా లీడర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనులే మాటల మంటలు రేపుతున్నాయి. ఐటీమంత్రి కేటీఆర్‌ వర్సెస్‌ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య వార్‌ కంటీన్యూ అవుతోంది. ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటూ హీట్ పెంచుతున్నారు. డైలాగులు పేల్చుతూ ప్రజలకు అసలుసిసలైన ఎలక్షన్‌ మజాను పంచుతున్నారు. తాజాగా మరోసారి ట్వి్ట్టర్‌ వేదికగా ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. కొత్త ప్రభావర్‌పై దాడి విషయంలో మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌కు బదులుగా రేవంత్‌రెడ్డి ఘాటైన ట్వీట్ వేశారు.


మొండి కత్తి డ్రామా:
బీఆర్‌ఎస్‌ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన వ్యక్తిని దుబ్బాక నియోజకవర్గం చెప్యాలకు చెందిన గటని రాజుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇదే విషయంపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు. 'బీఆర్ఎస్ ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారంటూ ట్వీట్ చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ నాయకులను భౌతికంగా నిర్మూలించే ప్రయత్నాలను జరుగుతున్నాయంటూ ఆరోపించారు. నేరస్థుడిని టీపీసీసీ(TPCC) ప్రెసిడెంట్‌గా చేశారంటూ రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేశారు కేటీఆర్‌.


కుటిల నీతి అంటూ రేవంత్‌ ఫైర్:
కేటీఆర్‌ ట్వీట్‌పై రేవంత్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. కేసీఆర్ అంటేనే గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలకు మారు పేరని తెలంగాణ సమాజానికి అర్థమైపోయిందంటూ ట్వీట్ చేశారు. ఒక ఎంపీపై దాడి జరిగితే దానిని చిల్లర రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే మీ కచరా ప్రయత్నం చూస్తుంటే బీఆర్ఎస్ ఓటమి ఖాయం ఐనట్టేనంటూ మండిపడ్డారు. ఈ సరికొత్త మొండి కత్తి డ్రామాను మీరు, మీ తండ్రి కలిసి రక్తి కట్టిస్తున్న వైనాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందని.. జరిగిన దుర్ఘటనను కాంగ్రెస్ కు అంటగట్టే మీ కుటిల నీతి ప్రజలకు అర్థమైందని ఆరోపించారు రేవంత్‌ రెడ్డి. ఏది ఏమైనా దాడిని ఖండిస్తున్నామని.. అహింసనే ఆయుధంగా చేసుకుని దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిన కాంగ్రెస్ కు మీ తండ్రి లాంటి మరుగుజ్జును ఓడించడం పెద్ద లెక్క కాదంటూ ఫైర్ అయ్యారు రేవంత్‌రెడ్డి.

Also Read: కొత్త ప్రభాకర్ రెడ్డిని పొడిచింది ఇతడే.. ఫొటో రిలీజ్ చేసిన బీఆర్ఎస్!

Advertisment
Advertisment
తాజా కథనాలు