Kavitha: కాంగ్రెస్ కావాలా? .. కరెంట్ కావాలా?.. కవిత కీలక వ్యాఖ్యలు! తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు ఎమ్మెల్సీ కవిత. ఎన్నికలు రాగానే రాహుల్ వస్తాడు ఆ తరువాత రాడు అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కావాలా?.. కరెంట్ కావాలా? అని ప్రశ్నించారు. By V.J Reddy 26 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రచారానికి మరో రెండు రోజుల సమాయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తరఫున ప్రచారంలో దుసుకుపోతున్నారు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha). బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ALSO READ: లోకేష్ యువగళం.. రేపటి నుంచి షురూ! తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీపై చురకలు అంటించారు. రాహుల్ గాంధీ వచ్చి బిర్యాని, పాన్ తిని వెళ్ళిపోతారని ఎద్దేవా చేశారు. గాంధీలు చుట్టపు చూపుగా ఇలా వచ్చిపోతుంటారు అని అన్నారు. కేసీఆర్ మాత్రం పక్క లోకల్ అని తేల్చి చెప్పారు. అండగా నిలిచిన ప్రతిసారి తెలంగాణను నిండా ముంచింది గాంధీ కుటుంబం అని పేర్కొన్నారు. తెలంగాణకు తీరని మోసం చేసింది గాంధీ కుటుంబమే అంటూ ధ్వజమెత్తారు. వందలాది మంది యువతను కాంగ్రెస్ పార్టీ బలితీసుకుందని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ ఆలస్యం కావడంతో అనేక మంది ఆత్మబలిదానాలు తీసుకున్నారని ఫైర్ అయ్యారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా లేదా కన్నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా ?.. రైతు బంధు కావాలా లేదా రాబంధు కావాలా?కాంగ్రెస్ మూడు గంటల కరెంటు కావాలా... బీఆర్ఎస్ 24 గంటల కరెంటు కావాలా ? కాంగ్రెస్ పాలనలో చూసిన దారుణమైన పరిస్థితులు కావాలా ? అని తెలంగాణ ప్రజలకు ప్రశ్నించారు. దారుణ పరిస్థితి మళ్లీ రావద్దంటే కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరారు. ALSO READ: తస్మాత్ జాగ్రత్త!.. పేర్ని నానికి కొల్లు రవీంద్ర హెచ్చరిక! #rahul-gandhi #telugu-latest-news #telangana-election-2023 #kavitha #telangana-elections-updates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి