/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Jaggareddy-jpg.webp)
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ (Telangana Congress) కీలక నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు గెలవబోతుందన్నారు. తమకు 70 సీట్లు పక్కా అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రచ్చబండ నిర్వహిస్తామని ప్రకటించారు. ఇంకా ఇళ్లు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామన్నారు. సంగారెడ్డిలో తాను వేసిన రోడ్లపైనే బీఆర్ఎస్ నేతలు తిరుగుతున్నారన్నారు. పార్టీ మారొద్దని గాలి అనిల్ కుమార్ ను (Gali Anil Kumar) కోరుతున్నట్లు చెప్పారు. జగ్గారెడ్డి పూర్తి ఇంటర్వ్యూని ఈ కింది వీడియోలో చూడండి..