Bandi Sanjay: కేటీఆర్.. నీకెంత కండకావరం?... బండి సంజయ్ ఫైర్! మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్. కేటీఆర్.. నీకెంత కండకావరం? ఉద్యోగాలడిగితే… తిడతావా అని ఫైర్ అయ్యారు. కేఏ పాల్ తమ్ముడు గంగుల కమలాకర్ అని విమర్శించారు. By V.J Reddy 21 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Elections 2023: ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ (KTR) పై ఫైర్ అయ్యారు బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay). కేటీఆర్ కు కండ కావరం తలకెక్కిందని అన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలెందుకివ్వడం లేదని నిరసన తెలిపితే… తప్పు చేశానని చెంపలేసుకోవాల్సిన కేటీఆర్ చెత్త నాకొడుకుల్లారా… సన్నాసుల్లారా.. అంటూ బూతులు తిడుతున్నాడు.. తండ్రీ కొడుకులకు అహంకారం ఎక్కువైందని మండిపడ్డారు. తెలంగాణలోని యువకులంతా వాళ్లకు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ALSO READ: నన్ను చంపేస్తారు.. బర్రెలక్క సంచలన ప్రెస్ మీట్! కరీంనగర్ ప్రచారంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. గంగుల కమలాకర్ (Gangula Kamalakar) మాటలను చూస్తే నాకు నవ్వొస్తుందని అన్నారు. కమలాకర్ కేఏ పాల్ (KA Paul) తమ్ముడని విమర్శించారు. జోకర్ లెక్క మాట్లాడుతున్నడు…ఏం మాట్లాడుతున్నడో ఆయనకే అర్ధం కావడం లేదని అన్నారు. గంగులకు నేను సవాల్ చేసిన.. నాపేరు మీదు, బినామీ పేరుమీద ఉన్న ఆస్తిపాస్తుల డాక్యుమెంట్లన్నీ తీసుకురా… అవన్నీ కరీంనగర్ ప్రజలకు రాసిస్తా…. నీ పేరు, నీ కుటుంబ సభ్యుల, బినామీల పేరిట ఉన్న డాక్యుమెంట్లన్నీ తీసుకొస్తా… ప్రజలకు రాసిచ్చేందుకు సిద్దమా? అని మంత్రి గంగులకు సవాల్ విసిరారు బండి సంజయ్. ALSO READ: BIG BREAKING: సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ షాక్ #ktr #bandi-sanjay #telangana-elections-2023 #telugu-latest-news #telangana-latest-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి