TS Elections 2023: తెలంగాణ బీజేపీకి మరో బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా!

తెలంగాణ ఉద్యమకారుడు, ఆర్టీసీ యూనియన్ మాజీ నేత అశ్వత్థామ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పారు. వనపర్తి టికెట్ ను తొలుత అశ్వత్థామ రెడ్డికి ప్రకటించిన బీజేపీ తర్వాత వేరే వారికి కేటయించింది. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు.

New Update
TS Elections 2023: తెలంగాణ బీజేపీకి మరో బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా!

తెలంగాణలో బీజేపీకి (Telangana BJP) మరో బిగ్ షాక్ తగిలింది. ఈటల రాజేందర్ తో (Eatala Rajendar) పాటు చేరిన అశ్వత్థామ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి (Kishan Reddy) లేఖ రాశారు. అశ్వత్థామ రెడ్డిని మొదటగా వనపర్తి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. కానీ ఆఖరి నిమిషంలో ఆయన స్థానంలో అనుగ్న రెడ్డి పేరును ఖరారు చేసింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అశ్వత్థామ రెడ్డికి ఈటల రాజేందర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఆర్టీసీ యూనియన్ నేతగా అశ్వత్థామ రెడ్డి చాలా కాలం పని చేశారు. బీఆర్ఎస్ అనుబంధ యూనియన్ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ యూనియన్ కు ప్రస్తుత మంత్రి హరీశ్ రావు నాడు గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
ఇది కూడా చదవండి: ED Raids: గడ్డం వినోద్ ఇంట్లో ఈడీ సోదాలు.. ఆ పార్టీల పనే అంటున్న కాంగ్రెస్..

సకల జనుల సమ్మె సమయంలోనూ అశ్వత్థామ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అయితే.. ఆర్టీసీ సమ్మె సమయంలో జరిగిన పరిణామాలతో ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీతో అశ్వత్థామ రెడ్డికి గ్యాప్ వచ్చింది. ఈ క్రమంలో ఉద్యోగానికి రాజీనామా చేసిన అశ్వత్థామ రెడ్డి ఈటల రాజేందర్ తో పాటు బీజేపీలో చేరారు. వనపర్తి నుంచి పార్టీ టికెట్ ఆశించి అక్కడ పని చేసుకున్నారు. కానీ ఆయన పేరును ప్రకటించి మార్చడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఈ క్రమంలోనే పార్టీకి రాజీనామా చేశారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని ఈ సందర్భంగా అశ్వత్థామ రెడ్డి తెలిపారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరుతారన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలతో ఉన్న పాత సాన్నిహిత్యంతో ఆ పార్టీలో చేరుతారా? లేక కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? అన్న చర్చ సాగుతోంది. మరో ఒకటి రెండు రోజుల్లో అశ్వత్థామ రెడ్డి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు