ఆర్టికల్‌ 370 రద్దుని కాంగ్రెస్ అడ్డుకుంది.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. 370 ఆర్టికల్‌ రద్దుని కాంగ్రెస్ అడ్డుకుందని అన్నారు. మోదీ హయాంలో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి దేశ రక్షణలో కీలకంగా వ్యవహరించామని తెలిపారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లే అని అన్నారు.

New Update
ఆర్టికల్‌ 370 రద్దుని కాంగ్రెస్ అడ్డుకుంది.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఈసారి తెలంగాణలో అధికారంలో వచ్చేది బీజేపీ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు.

ALSO READ: రైతులకు రూ.300కే యూరియా.. కామారెడ్డిలో మోదీ!

పటాన్‌చెరులో ఎన్నికల ప్రచారం అమిత్‌ షా మాట్లాడుతూ.. రామప్ప దేవాలయంలోని రుద్రేశ్వరస్వామికి నమస్కరించి చెబుతున్నా.. 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో (Ayodhya) రామమందిరం నిర్మాణాన్ని అడ్డుకుంది అని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. బీఆర్ఎస్ కు వేసినట్లేనని అమిత్‌ షా విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే.. అందులో 12 మంది బీఆర్ఎస్ లో చేరిపోయారని అన్నారు. ఈసారి కూడా అదే రిపీట్ అవుతోందని అన్నారు.

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని అన్నారు. 370 ఆర్టికల్‌ని కాంగ్రెస్ అడ్డుకుందని సంచలన ఆరోపణలు చేశారు. వారు ఎన్ని అడ్డంకులు సృష్టించిన మోదీ సర్కారు ఆర్టికల్‌ని రద్దు చేసిందని అన్నారు. పాకిస్తాన్ గడ్డపై సర్జికల్ స్ట్రైక్ చేసి వెన్నులో వణుకు పుట్టించిందని అమిత్ షా వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. బీసీని సీఎం చేస్తామని పునరుద్ఘాటించారు.

ALSO READ: రూ.15 లక్షలు వచ్చాయా?.. మోదీపై ఖర్గే చురకలు!

#brs #congress #telugu-latest-news #breaking-news #amit-shah #telanganaelections2023
Advertisment
Advertisment
తాజా కథనాలు