Telangana special Items: సీడబ్ల్యూసీ సమావేశాలు.. అతిథులకు బోటి కూర, మటన్‌ కర్రీ, సర్వపిండి!

ఒకటి రెండు కాదు ఏకంగా 125 రకాల తెలంగాణ ఐటమ్స్‌ (125 Telangana Items)ను అతిథులకు అందించనున్నారు. ఉదయం అల్పాహారం నుంచి భోజనం వరకు మొత్తం తెలంగాణ స్టైల్లోనే ఈ విందును ఏర్పాటు చేస్తున్నారు. వీటిని తయారు చేసేందుకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వంట మనుషులను తీసుకుని వస్తున్నట్లు తెలిపారు.

New Update
Telangana special Items: సీడబ్ల్యూసీ సమావేశాలు.. అతిథులకు బోటి కూర, మటన్‌ కర్రీ, సర్వపిండి!

125 types of dishes in CWC Meeting: నిన్న మొన్నటి వరకు దేశ రాజధాని నగరం ఢిల్లీ జీ 20 (G20 Summit)సమావేశాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సమావేశాలకి విదేశీ ప్రతినిధులు చాలా మంది హాజరయ్యారు. వారందరికీ కూడా భారతీయ వంటకాల రుచులు చూపించారు మన నాయకులు. వారికి సౌత్ నుంచి ప్రత్యేకంగా ఇడ్లీ, దోశె వంటివి అందిచారు.

ఇప్పుడు కాంగ్రెస్‌ (Congress)అధికారుల వంతు వచ్చింది. హైదరాబాద్‌ వేదికగా సీడబ్ల్యూసీ(CWC) సమావేశాన్ని రెండు రోజులు పాటు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు కాంగ్రెస్ అధినేత మల్లిఖార్జునఖర్గే (Mallikarjun Kharge)తో పాటు అగ్రనేతలంతా నగరానికి రానున్నారు. ఈ సమావేశాలకు విచ్చేయుచ్చున్న అతిథులకు ప్రత్యేకంగా తెలంగాణ రుచులను రుచి చూపించబోతున్నారు.

ఒకటి రెండు కాదు ఏకంగా 125 రకాల తెలంగాణ ఐటమ్స్‌ (125 Telangana Items)ను అతిథులకు అందించనున్నారు. ఉదయం అల్పాహారం నుంచి భోజనం వరకు మొత్తం తెలంగాణ స్టైల్లోనే ఈ విందును ఏర్పాటు చేస్తున్నారు. వీటిని తయారు చేసేందుకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వంట మనుషులను తీసుకుని వస్తున్నట్లు తెలిపారు. ఉదయం అల్పాహారంలో ఇడ్లీ(Idly), వడ, దోశ, ఫ్రూట్ సలాడ్, ఉప్మా, కిచిడీ, కుర్మా, రాగి సంగటి, మిల్లెడ్ వడలను వడ్డించనున్నారు.

మధ్యాహ్నం భోజనంలోనికి ప్రపంచ ఖ్యాతి పొందిన హైదారాబాదీ ధమ్‌ బిర్యానీ(Dhum Biryani), బగార రైస్‌, బోటీ కూర, తలకాయ కూర, పాయ, మటన్, మటన్ లివర్‌ ప్రై, తెలంగాణ స్పెషల్ మటన్‌ కూర, చింతచిగురు మటన్, గోంగూర మటన్‌, దోసకాయ మటన్‌, అంకాపూర్ చికెన్‌, చేపలు, హలీం వంటి వాటిని నాన్‌ వెజ్‌ మెనూగా అందిస్తున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే వీటితో పాటు పచ్చి పులుసు, గోంగూర పచ్చడి, గుత్తి వంకాయ, కొబ్బరి చట్నీ, అంబలి, దాల్చా, పలు రోటి పచ్చళ్లు వడ్డించనున్నారు. సాయంత్రం స్నాక్స్‌ గా సర్వ పిండి, కుడుములు, మురుకులు, మక్క గుడాలు, మొక్క జొన్న గారెలు, సకినాలు, గారెలను అతిధులకు అందించనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. వీటన్నింటితో పాటు మరో 12 రకాల స్వీట్ ఐటమ్స్‌, ఇరానీ ఛాయ్‌, ఉస్మానియా బిస్కెట్లను అందిస్తున్నారు.

Also Read: తెలంగాణలో వానలే వానలు.. హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్‌ వాతావరణశాఖ

Advertisment
Advertisment
తాజా కథనాలు