TS CPGET: సీపీగెట్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్

తెలంగాణలో ఎంఏ, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంకాం తదితర కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (CPGET-2024) ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్ తదితర వివరాలు ఎంటర్ చేసి ర్యాంక్‌ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

New Update
TS CPGET: సీపీగెట్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్

TS CPGET Results 2024: తెలంగాణలో ఎంఏ, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంకాం తదితర కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (CPGET-2024) ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి ర్యాంక్‌ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జులై 6 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌ పీజీ ప్రవేశ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 73,342 మంది దరఖాస్తు చేసుకోగా.. 64,765 మంది హాజరయ్యారు. ఇటీవలే 'కీ' ని విడుదల చేసిన అధికారులు.. శుక్రవారం ఫలితాలను ప్రకటించారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: ‘ఆపరేషన్ దేశద్రోహం’.. సంచలన విషయాలు బయటపెట్టనున్న RTV

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Drugs In Hyd: హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థుల పాడుపని.. మత్తు కోసం ఇంక్షన్లు, ట్యాబ్లెట్లు - ఒకరు మృతి

హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో మత్తు కోసం ముగ్గురు విద్యార్థులు మెడికల్ డ్రగ్స్ తీసుకున్నారు. మత్తు మోతాదుకు మించడంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. మెడికల్ డ్రగ్స్‌ను ఆ స్టూడెంట్స్‌కు విక్రయించిన సాహిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

New Update
inter student dies after taking injections and tablets for intoxication

inter student dies after taking injections and tablets for intoxication

రాష్ట్రంలో యువతను మత్తుకు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు అధికారులు ఒకవైపు చర్యలు తీసుకుంటుంటే.. మరోవైపు యువత కొత్త తరహా డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో యువత ఈ విధమైన అలవాటుకు పాల్పడుతున్నారు. ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు లేకుండా ప్రమాదకరమైన మత్తు ట్యాబ్లెట్లతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 

Also Read: కర్ణాటక డీజీపీ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి హత్యకు సహకరించిన కూతురు?

మెడికల్ డ్రగ్స్‌ మత్తు

ఒక్క ట్యాబ్లెట్లు మాత్రమే కాకుండా ఇంజెక్షన్లను సైతం తీసుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అలా చేసిన ముగ్గురు విద్యార్థులలో ఒకరు మృతి చెందాడు. మరో ఇద్దరు కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్నారు. హైదరాబాద్‌లోని బాలాపూర్ మత్తు కోసం ముగ్గురు స్టూడెంట్స్ ట్యాబ్లెట్ల డ్రగ్స్ తీసుకున్నారు. అయితే దాని మోతాదు ఎక్కువ కావడంతో అక్కడికక్కడే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: మావోయిస్టు అగ్రనేత హతం.. వివేక్‌ను మట్టుబెట్టిన భధ్రతాబలగాలు!

సాహిల్ అనే వ్యక్తి ముగ్గురు విద్యార్థులకు మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ అమ్మాడు. ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లను వారికి విక్రయించాడు. వాటిని ఆ ముగ్గురు స్టూడెంట్స్ ఒకేసారి తీసుకున్నారు. అందులో ఇంటర్ చదివే ఒక విద్యార్థి అబ్దుల్ నసర్ స్పాట్‌లోనే చనిపోయాడు. మరో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. ఈ విషయం తెలిసి పోలీసులు దర్యాప్తు చేశారు. 

Also Read :  ఆగని యుద్ధం.. 30 వేల మంది యువతను నియమించుకున్న హమాస్ !

ఇందులో భాగంగా ఆ ముగ్గురు విద్యార్థులకు మెడికల్ డ్రగ్స్ అమ్మిన సాహిల్‌ను అరెస్టు చేశారు. ఈ మేరకు ఎలాంటి అనుమతులు లేకుండా అతడు ట్యాబ్లెట్లు, మత్తు ఇంజక్షన్లు అమ్ముతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా కొందరు యువకులు వీటిని సొంతంగా వినియోగించడమే కాకుండా.. వేరే వారికి కూడా అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. 

Also Read :  కేవలం రూ.300 వందలకే ఇంటింటికీ ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

 

drugs-case | drugs-in-hyderabad | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | latest telangana news | telangana news live | telangana news today | telangana news live updates | telangana crime incident | telangana-crime-updates | telugu crime news

Advertisment
Advertisment
Advertisment