Telangana: బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం.. కాంగ్రెస్ ఎంపీలు కీలక నిర్ణయం

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్‌ కేటాయించకపోవడంతో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఢిల్లీలో సమావేశమయ్యారు. తెలగాణకు జరిగిన అన్యాయంపై, రావాల్సిన నిధులపై బుధవారం పార్లమెంట్‌లో నిరసన చేయాలని నిర్ణయించుకున్నారు.

New Update
Telangana: బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం.. కాంగ్రెస్ ఎంపీలు కీలక నిర్ణయం

2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వివిధ రంగాలన్నింటికీ కలిపి మొత్తం రూ.48.21 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు. అయితే తెలంగాణకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్‌ కేటాయించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని వెస్ట్రన్‌ కోర్టులో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశం అయ్యారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఏపీ విభజన చట్టంలో తెలగాణకు రావాల్సిన నిధులు, హక్కుల కోసం పోరాటం చేయాలని.. ఇందుకోసం బధవారం పార్లమెంట్‌లో నిరసన చేయాలని నిర్ణయించుకున్నారు.

Also Read: సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు

మరోవైపు బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ అనే పదాన్ని నిషేధించిందని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేకసార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్ర అభివృద్దికి సహకరించాలంటూ విజ్ఞప్తి చేసినా వివక్ష చూపిందన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ మండిపడ్డారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బండియ సంజయ్, కిషన్ రెడ్డి బానిసల్లాగా పనిచేయొద్దంటూ హితబోధ చేశారు.

Also Read: వయసు..వావి వరుస చూడని వికారం.. చిన్నారులను చిదిమేస్తున్న పో* వీడియోల ప్రభావం!

Advertisment
Advertisment
తాజా కథనాలు