TS Congress: గెలుపే లక్ష్యం.. ఈ నెల 15 నుంచి తెలంగాణలోనే రాహుల్, ప్రియాంక మకాం! ఎన్నికలకు ముందు 15 రోజులు అగ్రనేతలు రాష్ట్రాన్ని చుట్టేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది హస్తం పార్టీ. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి 28 వరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రతీ జిల్లా కవర్ అయ్యేలా ప్రచారం నిర్వహించనున్నారు. By Nikhil 06 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో గెలుపే లక్ష్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ (Congress Party) వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఏకంగా వరుసగా 14 రోజుల పాటు రాష్ట్రంలోనే మకాం వేసి ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఈ నెల 15 నుంచి 28వ తేదీ వరకు వీరి పర్యటన షెడ్యూల్ ను ఖరారు చేశారు. దాదాపు ప్రతీ జిల్లా, ప్రతీ నియోజకవర్గాన్ని టచ్ చేసేలా వీరి పర్యటన ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర నాయకులు రూట్ మ్యాప్ ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఇది కూడా చదవండి: Telangana Election 2023: కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు.. కాంట్రాక్టర్ల ప్రాజెక్ట్: కోదండరామ్ తెలంగాణలో పార్టీ గెలిచే అవకాశం ఉందని అంచనాకు వచ్చిన హైకమాండ్ ఎట్టి పరిస్థిల్లోనూ అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తోంది. దీంతో ప్రతీ విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 100 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. మరో 19 మంది అభ్యర్థులతో ఫైనల్ లిస్ట్ నేడు లేదా రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. ఓ వైపు అభ్యర్థుల లిస్ట్ పై కసరత్తు చేస్తూనే మరో వైపు రాష్ట్రంలో ప్రచారాన్ని మాత్రం ఆపడం లేదు హైకమాండ్. ఇప్పటికే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, డీకే శివకుమార్ రాష్ట్రంలో పర్యటించారు. ఇది కూడా చదవండి: Election King: కేసీఆర్‌పైనే పోటీ..! రాహుల్, పీవీ, కరుణానిధి, జయలలితతోనూ తలపడ్డ ఈ ఎలక్షన్ కింగ్ ఎవరూ? ఇదిలా ఉంటే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై పోటీకి దించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 10న కామారెడ్డిలో నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రేవంత్ పేరును స్వయంగా ప్రకటిస్తారని పార్టీలో చర్చ సాగుతోంది. అదే రోజు భారీ ర్యాలీతో నామినేషన్ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. #congress #rahul-gandhi #telangana-elections-2023 #priyanka-gandhi #telangana-politics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి