Telangana:లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఆరు గ్యారంటీల అమలు లోక్‌సభ ఎన్నికల కన్నా ముందే ఆరు గ్యారంటీలను అమలు చేయాలనుకుంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు మరో రెండు పథకాల అమలు చేయాలని భావిస్తున్నారు. దీని కోసం పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. By Manogna alamuru 30 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి 6 guarantees:ఆరుగ్యారంటీల అమలులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. వాటికోసం ఇప్పటికే అభయహస్తం దరఖాస్తులను ప్రవేశపెట్టారు. ఇప్పుడు తాజాగా లోక్‌సభ ఎన్నికల లోపు ఆరుగ్యారంటీల్లో మరో రెండిటిని అమలు చేయాలని భావిస్తున్నారు రేవంత్. మహిళలకు రూ.2500 నగదు, రూ.500 గ్యాస్ సిలిండర్ లేదా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం...ఈ మూడు పథకాల్లో రెండింటిని అమలు చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు గైడ్ లైన్స్, అర్హులను ఎంపిక చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. Also Read:Penssion:మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్..పెన్షన్‌లో కొడుకు లేదా కూతురు పేరు నామినేట్ ఇందిరమ్మ ఇళ్ళకే ఎక్కువ దరఖాస్తులు.. అభయహస్తం దరఖాస్తుల్లో ఇందిరమ్మ ఇళ్లకు భారీగా అప్లికేషన్లు వచ్చాయి. దాదాపు 80 లక్షల మంది దీని కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీ ఇప్పటికే పూర్తి అయింది. ఇక వీటిని వడపోయడం, లబ్దిదారులను ఎంపిక చేయడం మాత్రం మిగిలే ఉంది. ఏయే పథకం కింద ఎంత మందికి ప్రయోజనం కలుగుతుంది? ఖజానాపై ఎంత భారం పడుతుందన్న లెక్కలు తీస్తున్నారు అధికారులు. లెక్కల కసరత్తు అయిపోయిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ పథకం అమలులో నిర్ణయం, ప్రకటన చేసుకునే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వస్తే.. ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. అప్పుడు ఇక కొత్త పథకాలు అమలు చేసే ఛాన్స్ ఉండదు. కాబట్టి షెడ్యూల్ విడుదలకు ముందే కనీసం రెండు పథకాలు అమలు చేయాలని రేవంత్ రెడ్డి అధికారులతో చెబుతున్నారు. మహాలక్ష్మికే ఎక్కువ… అభయహస్తం గ్యారంటీలతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు అర్జీలు పెట్టుకున్నారు తెలంగాణ వాసులు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. అందులో గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) నుంచి అత్యధికంగా 18.97లక్షల అప్లికేషన్స్ వస్తే… అత్యల్పంగా భూపాలపల్లి జిల్లా నుంచి 1.37లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా మహాలక్ష్మి పథకానికే మహిళలు జైకొట్టారని తెలిపారు. ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకానికే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. మహాలక్ష్మి కింద మహిళలకు నెలకు రూ.2,500 పథకానికి..92,23,195 దరఖాస్తులు వచ్చాయి. తరువాతి స్థానం గ్యాస్ సిలిండెర్లదే.. మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) తర్వాత రూ.500కే గ్యాస్ సిలిండర్ల పథకానికి ఎక్కువ దరఖాస్తు చేస్తున్నారు తెలంగాణ వాసులు. రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకానికి మొత్తం 91,49,838 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇక మూవడ స్థానంలో ఇందిరమ్మ ఇళ్ళు పథకం ఉంది. తీ పథకానికి తాము అర్హులమంటూ 82,82,332 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక 200యూనిట్ల ఫ్రీ కరెంట్ (గృహజ్యోతి) పథకానికి 81,54,158 , రైతు భరోసా (భూమి ఉన్న రైతులకు రూ.15వేలు)కు 38,73,956 , రైతు భరోసా (కౌలు రైతులకు) 2,63,616, రైతు కూలీలకు రూ.12 వేలుకు 40,95,581 దరఖాస్తులు వచ్చాయి. #telangana #revanth-reddy #abhaya-hastam #6-guarantees మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి