Cabinet Visuals: ముగిసిన రేవంత్ తొలి కేబినెట్ భేటీ.. విజువల్స్, ఫొటోస్..! సచివాలయంలో రేవంత్‌రెడ్డి తొలి కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు 11 మంది మంత్రులు హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు తీసుకొచ్చిన కొన్ని ఫైళ్లపై రేవంత్ సంతకం చేశారు. By Trinath 07 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ(Telangana) నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) గురువారం రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంత్రులతో కలిసి సచివాలయానికి చేరుకుని ఆరో అంతస్తులోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తన భార్యతో కలిసి, పూజారుల బృందం వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించారు. ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించగానే అర్చకులు ఆశీర్వదించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు తీసుకొచ్చిన కొన్ని ఫైళ్లపై ఆయన సంతకం చేశారు. రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు 11 మంది మంత్రులు హాజరయ్యారు. ఈ భేటీ ఇప్పటికే ముగియగా దానికి సంబంధించిన వీడియోను కింద చూడండి. Your browser does not support the video tag. అంతకుముందు రేవంత్ రెడ్డికి అధికారులు, సచివాలయ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయం తలుపులు ప్రజల కోసం తెరుస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొత్త సచివాలయ సముదాయం, అత్యాధునిక ఫీచర్లతో, ప్రత్యేకమైన డిజైన్‌తో నిర్మించబడింది, ఏప్రిల్ 30న ప్రారంభించారు. ఇక రేవంత్ తొలి కేబినెట్ మీటింగ్‌కు సంబంధించిన ఫొటోలను కింద చూడండి. కేబినెట్ మీటింగ్ కేబినెట్ మీటింగ్ లో మంత్రులు Also Read: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఏసీబీకి ఫిర్యాదు.. కొత్త సీఎం యాక్షన్ ఏంటి? WATCH: #revanth-reddy #telangana-cabinet #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి